Heavy Floods: రోడ్లన్నీ మాయం.. నదులు ప్రత్యక్షం.. అక్కడి జనాల పరిస్థితి దయనీయం..!
Heavy Floods: రోడ్లు మాయమయ్యాయి. నదులు ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడ చూసినా నీరే. ఒకటి కాదు రెండు కాదు.. 30 వేల మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Heavy Floods: రోడ్లు మాయమయ్యాయి. నదులు ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడ చూసినా నీరే. ఒకటి కాదు రెండు కాదు.. 30 వేల మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా మలేషియాలో ప్రస్తుత పరిస్థితి. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మలేషియా ప్రజలు తల్లడిల్లుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనిస్థాయిలో కురిసిన వర్షపాతానికి సుమారు 30 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మలేషియాలో శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ప్రధాన రహదారులు తెగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాహనదారులు. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలకు చెందిన 30 వేలకు పైగా వరద బాధితులను అధికారికంగా లెక్కించింది మలేషియా ప్రభుత్వం. వారిలో 14 వేల మంది పహంగ్‌కు చెందినవారే.
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రిచెస్ట్ ప్లేస్ సెలంగోర్‌లో దాదాపు 10 వేల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారని, స్వయంగా ఆ దేశ ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ ప్రకటించారంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. ఒక నెలమొత్తంలో కురవాల్సిన వర్షం, ఒక్కరోజే కురిసిందని చెప్పారు అక్కడి అధికారులు. వరద బాధితులకు సత్వర సహాయం నిమిత్తం 179 కోట్ల నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఆ దేశ ప్రధాని. 6 సెంట్రల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రమాదకరస్థాయిలో వరదనీళ్లు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు యాకోబ్. మలేషియాతో ప్రతి ఏడాది చివరిలో రుతుపవనాల కారణంగా తరచూ అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఈ డిసెంబర్‌లో ప్రమాదకర స్థాయిలో వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also read:
