AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TANA: తెలుగు రాష్ట్రాలకు తానా సహాయం.. రూ.25 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాలు ఇస్తున్నట్లు ప్రకటన..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పెద్ద మనస్సు చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు తానా నుంచి 25 కోట్ల రూపాయల విలువైన మందులు, వైద్య పరికరాలు అందిస్తోంది.

TANA: తెలుగు రాష్ట్రాలకు తానా సహాయం.. రూ.25 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాలు ఇస్తున్నట్లు ప్రకటన..
Anjaiah Choudary
Srinivas Chekkilla
|

Updated on: Dec 21, 2021 | 2:56 PM

Share

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పెద్ద మనస్సు చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు తానా నుంచి 25 కోట్ల రూపాయల విలువైన మందులు, వైద్య పరికరాలు అందిస్తోంది. ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం ఓడల్లో ఉన్న మెడికల్ సామగ్రి ఈనెల 27న విశాఖపట్నం చేరుకుంటాయని తెలిపారు. చికాగోకు చెందిన నార్త్‌ వెస్ట్రన్‌ మెమోరియల్‌ హెల్త్‌ కేర్‌ ఈ పరికరాలను అందజేసినట్లు తెలిపారు.

తానా రెడ్‌క్రాస్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పరికరాలను అందజేయడానికి ప్రణాళిక వేసింది, పరికరాలు అవసరమైన ఆసుపత్రులను రెడ్‌క్రాస్ గుర్తిస్తోందని” చౌదరి చెప్పారు. గత 46 ఏళ్లుగా కుల, మత, ప్రాంతాలకు అతీతంతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తానా సేవా కార్యక్రమాలు చేస్తుందని వివరించారు. ఈ ఏడాది రద్దయిన తానా మహాసభలు 2023లో నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

తానా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశాఖపట్నంలో తన తొలి పర్యటనకు వచ్చిన అంజయ్య చౌదరి అసోసియేషన్‌లో 40,000 మంది జీవితకాల సభ్యులున్నారని తెలిపారు. “తానా యొక్క టీమ్ స్క్వేర్ చొరవతో 40,000 మందికి గుండె శస్త్రచికిత్సలు, 4,000 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. గ్రేస్ ఫౌండేషన్, బసవతారకం ఇండో-అమెరికన్ హాస్పిటల్‌తో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 150 క్యాన్సర్ శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.

Read Also.. NRI News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఎన్ఆర్ఐ కొడుకు దుర్మరణం.. కూతురి పరిస్థితి విషమం..