AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US: ఆ ఉగ్రవాద దాడిపై సమాచారమిస్తే 5 మిలియన్ల డాలర్ల రివార్డ్.. ప్రకటించింది ఎవరో తెలుసా..?

Atlanta researcher Avijit Roy: బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిపై సమాచారం ఇచ్చిన వారికి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్స్ డిప్లమాటిక్ సెక్యూరిటీ సర్వీస్ రివార్డ్స్ ఫర్ జస్టిస్

US: ఆ ఉగ్రవాద దాడిపై సమాచారమిస్తే 5 మిలియన్ల డాలర్ల రివార్డ్.. ప్రకటించింది ఎవరో తెలుసా..?
Terrorist Attack
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 22, 2021 | 8:58 AM

Atlanta researcher Avijit Roy: బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిపై సమాచారం ఇచ్చిన వారికి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్స్ డిప్లమాటిక్ సెక్యూరిటీ సర్వీస్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ (RFJ) కార్యాలయం 5 మిలియన్ల డాలర్ల రివార్డ్ అందిస్తామని ప్రకటించింది. ఈ ఉగ్రదాడిలో అంట్లాంటా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవిజిత్ రాయ్ మృతి చెందగా, అతని భార్య రఫీదా బోన్యా అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. డిపార్ట్‌మెంట్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్.. రాయ్ హత్య, అహ్మద్‌పై దాడికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని కోరారు. ఈ ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను వెల్లడించిన.. ఏ దేశంలోనైనా అరెస్టు లేదా నేరారోపణకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించిన వారి $ 5 మిలియన్ల డాలర్ల రివార్డ్‌ అందిస్తామని ప్రకటించారు.

కాగా.. 2015 ఫిబ్రవరి 26న అమెరికా పౌరులైన రాయ్, అహ్మద్ ఇద్దరూ ఒక పుస్తక ప్రదర్శనలో పాల్గొనడానికి బంగ్లాదేశ్‌ రజధాని ఢాకాను సందర్శించారు. ఈ క్రమంలో వారిపై దుండగులు కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రాయ్ మృతి చెందగా, అహ్మద్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని అమెరికా వెల్లడించింది. ఈ క్రూరమైన ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని.. చట్టం ప్రకారం శిక్షిస్తామని.. అందుకు తగిన సమాచారాన్ని కోరుతున్నట్లు అమెరికా తెలిపింది.

ఈ ఘటనపై బంగ్లాదేశ్‌లో మొత్తం ఆరుగురు వ్యక్తులపై అభియోగాలు మోపారు. వారందరినీ విచారించి దోషులుగా నిర్ధారించారు. అయితే.. శిక్ష పడిన ఇద్దరు కుట్రదారులైన సయ్యద్ జియావుల్ హక్ (అకా మేజర్ జియా), అక్రమ్ హుస్సేన్‌లను పరారీలో ఉన్నారని.. డిపార్ట్‌మెంట్ తన ప్రకటనలో పేర్కొంది.

బంగ్లాదేశ్‌లో ఉన్న అల్ ఖైదా-ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా బృందం ఈ దాడికి బాధ్యత వహించింది. రాయ్, అహ్మద్‌లపై దాడి తమ చర్యే అని అల్ ఖైదా ఉగ్రవాదులు ప్రకటించారు. ఆ తర్వాత యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్స్ డిప్లమాటిక్ సెక్యూరిటీ సర్వీస్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ నేరస్థుల కోసం అణ్వేషణ కొనసాగిస్తూనే ఉంది. 1984లో ప్రారంభించిన ఈ సంస్థ ఉగ్రవాద దాడులను నిరోధించడంలో, ఉగ్రవాదులను న్యాయస్థానంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read:

అర్ధరాత్రి ఉలిక్కిపడిన బిల్డింగ్ వాసులు.. ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి.. ఆ తర్వాత..

Healthy Habits: ఇలా చేస్తే రోజంతా హ్యాపీనే.. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు వీటిని అలవర్చుకోండి..