Healthy Habits: ఇలా చేస్తే రోజంతా హ్యాపీనే.. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు వీటిని అలవర్చుకోండి..

Health Tips: ఉరుకులు పరుగుల జీవితంలో శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యం కోసం చాలా మంది పలు పద్దతులను అవలంభిస్తుంటారు. అయితే ఫిట్ బా

Healthy Habits: ఇలా చేస్తే రోజంతా హ్యాపీనే.. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు వీటిని అలవర్చుకోండి..
Healthy Habits
Follow us

|

Updated on: Dec 22, 2021 | 8:05 AM

Health Tips: ఉరుకులు పరుగుల జీవితంలో శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యం కోసం చాలా మంది పలు పద్దతులను అవలంభిస్తుంటారు. అయితే ఫిట్ బాడీ లేదా ఆరోగ్యకరమైన మానసిక స్థితి ఒక్కరోజులో ఏర్పడదు అనేది అక్షరాల నిజం. మీ కలల శరీరాన్ని, జీవితాన్ని పొందడానికి మీరు సంకల్పంతో ముందడుగు వేస్తే.. సాధ్యం అంటున్నారు నిపుణులు. దీనికోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాలి. కొన్ని మంచి అలవాట్లు మన లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడతాయి. కావున మీరు ప్రతిరోజూ అవలంబించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి మీరు తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో మీరు తెలుసుకోండి..

1. త్వరగా మేల్కొనడం పొద్దున్నే లేవడాన్ని మీరు ఎంత ద్వేషించినా.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. త్వరగా మేల్కొనడం వల్ల ధ్యానం లేదా వ్యాయామం చేయడానికి మీకు సమయం లభిస్తుంది. ఇది మీ శరీరం, మనస్సును ఆరోగ్యంగా ఉంచడంలో.. ఆనందాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

2. వ్యాయామం ఇది ఆలోచనలో కాకుండా.. ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. వ్యాయామం వల్ల చెమట వస్తుంది. దీని ద్వారా శరీరం నుంచి అన్ని టాక్సిన్‌లను తొలగిపోతాయి. దీంతోపాటు వ్యాయామం మీ రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. మీ చర్మం, జుట్టుకు కూడా వ్యాయామం చాలా మంచిది.

3. ఆరోగ్యకరమైన అల్పాహారం చాలా మంది బరువు తగ్గడానికి అల్పాహారం మానేస్తుంటారు. అయితే వాస్తవానికి, అల్పాహారం మానేయడం వల్ల ఆకలికి దారితీస్తుంది. అప్పుడు ఎక్కువగా తింటారు. కావున.. అల్పాహారం తినడం వల్ల మీరు మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తినలేరంటున్నారు నిపుణులు.

4. హైడ్రేషన్ కీలకం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. మీ కణాల పనితీరుకు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, టాక్సిన్‌లను తొలగించడానికి, ఇన్‌ఫెక్షన్‌లను నివారించడానికి హైడ్రేషన్ చాలా ముఖ్యమంటున్నారు

5. ఆరోగ్యకరమైన అల్పాహారం, పానీయాలు ఆరోగ్యకరమైన శరీరం కోసం, మీరు గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మరియు ఒత్తిడిని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

Also Read:

Lok Sabha: సభలో మీ ఎంపీ ఏం చేస్తున్నారో చూడాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

Crime News: ఇంట్లోకి వెళ్లకుండానే చనిపోయాడు.. లిఫ్ట్‌లో చిక్కుకొని బాలుడి దుర్మరణం.. అసలేమైందంటే..?

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే