Russia Ukraine Crisis: అసలేం ఏం జరుగుతోంది..? కీవ్ నగరంపై పట్టుకోసం రష్యా.. ఎదురుదాడులు చేస్తున్న ఉక్రెయిన్..
Russia Ukraine War Updates: మారణహోమం అనేది అందరికీ తెలుసు. కానీ అదేమి పట్టనట్టుగా.. రష్యా ఐదో రోజు దాడులను మరింత తీవ్రతరం చేసింది. కీవ్‌తోపాటు.. మరిన్ని నగరాలపై

Russia Ukraine War Updates: మారణహోమం అనేది అందరికీ తెలుసు. కానీ అదేమి పట్టనట్టుగా.. రష్యా ఐదో రోజు దాడులను మరింత తీవ్రతరం చేసింది. కీవ్‌తోపాటు.. మరిన్ని నగరాలపై నిరంతరాయంగా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ శాంతిని కోరుకున్నా.. రష్యా దాడులు మాత్రం ఆపడంలేదు. దీంతో ప్రతిఘటించాల్సిన పరిస్థితిలో రష్యన్లపై అటాక్ చేయక తప్పడంలేదు. రష్యా సైనికులు కీవ్ (Kiev) నగరంపై పట్టుకోసం దాడులు చేస్తున్నారు. కానీ ఉక్రెయిన్ మాత్రం తగ్గడంలేదు. ప్రజలు కూడా ఈ యుద్ధంలో పాల్గొనటం రష్యాను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్.. కూడా చర్చల కోసం బెలారస్ రాబోమని తేల్చి చెప్పింది. దీంతో ఉక్రెయిన్-బెలారస్ బోర్డర్‌లో ఉన్న ఏదో ఒక ప్రాంతంలో ఈ చర్చలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బెలారస్ (Belarus) ఈ భేటీని నిర్వహిస్తోంది. మరోవైపు రష్యాపై నాటోతోపాటు.. మిగిలిన దేశాలు కూడా గుర్రుగా ఉన్నాయి.
ఉక్రెయిన్‌లోకి చొరబడ్డ రష్యా ట్యాంకర్లు ఇంధనం లేక ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీనికి కారణం ఉక్రెయిన్ పెట్రో బంకులను నిర్వీర్యం చేసింది. దారిలో సైన్ బోర్డులు మార్చేసి తప్పుదోవ పట్టించి.. వాహనాల్లో ఇంధనం అయిపోయేలా చేశారు. అంతేకాదు.. గ్రామాల ద్వారా వెళ్లే సమయంలో వారికి సాధారణ పౌరులు అడ్డుపడడం.. కొందరు వాహనాలపై మాలటోవ్ బాంబులతో దాడులు చేయడంతో ధ్వంసమయ్యాయి.
ఈరోజు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగబోతోంది. యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం పెట్టాలా వద్దా అనే విషయంలో ఈరోజు ఓటింగ్ జరుగుతుంది. సాధారణ సభ సమావేశమైతే.. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలన్నీ.. అందులో పాల్గొనాల్సి ఉంటుంది. సాధారణ సభలో ఓటింగ్ ద్వారా రష్యాపై ఆంక్షలు విధించే అవకాశాలుంటాయి. ఇప్పటికే భద్రతామండలి ఓటింగ్‌ని వీటోతో అడ్డుకున్న రష్యా.. వీటో అధికారం పనిచేయని.. జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఏం చేస్తుందో చూడాలి. అక్కడ ఎన్ని దేశాలు రష్యాకి మద్దతిస్తాయో? ఎన్ని దూరంగా ఉంటాయో? ఎన్ని దేశాలు వ్యతిరేకంగా ఓటేస్తాయో అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఉక్రెయిన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎక్కింది. రష్యాకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. పుతిన్ ఉక్రెయిన్‌లో అతిపెద్ద మారణహోమానికి తెరలేపారంటూ ఆరోపించింది ఉక్రెయిన్ ఈ పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరగనుంది.
Also Read: