Ukraine Crisis: ఉక్రెయిన్‌లో మనవాళ్ల దుస్థితి కలవరపెడుతోంది.. వీడియోను ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

Russia - Ukraine War News: రష్యా బాంబు దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారతీయ పౌరులు, విద్యార్థులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. వీరిని ప్రత్యేక విమానాల్లో దేశానికి తరలిస్తోంది భారత ప్రభుత్వం.

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో మనవాళ్ల దుస్థితి కలవరపెడుతోంది.. వీడియోను ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi (File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: Feb 28, 2022 | 10:40 AM

Russia – Ukraine War News: రష్యా బాంబు దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారతీయ పౌరులు, విద్యార్థులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. వీరిని ప్రత్యేక విమానాల్లో దేశానికి తరలిస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పటి వరకు 2000 మంది దేశ పౌరులను స్వదేశానికి తరలించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇంకా అక్కడ చిక్కుకపోయిన వేలాది మంది భారతీయులు స్వదేశానికి వెనుదిరిగేందుకు భారత ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారిని స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం చేపట్టనున్న చర్యల వివరాలను తెలియజేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి తనను కలవరపెడుతున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆ మేరకు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వీడియోను జతచేర్చుతూ ఓ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌ హింసలో భారత విద్యార్థులు చిక్కుకపోవడం.. ఆ విజువల్స్‌ను చూస్తూ వారి కుటుంబీకులు పరితపించడం బాధాకరమన్నారు. ఇలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదన్నారు. వారిని సురక్షితంగా దేశానికి తరలించేందుకు చేపట్టనున్న చర్యల సమగ్ర వివరాలను బాధిత కుటుంబాలకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మన వారిని నిస్సహాయిలుగా వదిలేయడం సరికాదంటూ ఓ వీడియోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఉక్రెయిన్‌లో పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు కీలక సమావేశం నిర్వహించారు. అక్కడ నెలకొన్న పరిస్థితిని విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ ష్రింగ్లా వీడియో ప్రజెంటేషన్ ద్వారా ప్రధానికి వివరించారు. అలాగే అక్కడ చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు చేపడుతున్న చర్యల వివరాలను ప్రధానికి తెలియజేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి తరలించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలిచ్చారు.