Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telecom Services: మొబైల్‌ ఫోన్‌ కస్టమర్ల సేవా సమస్యల ఫిర్యాదుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..!

Telecom Services: టెలికాం సేవలలో లోపానికి సంబంధించి ఒక కంపెనీకి వ్యతిరేకంగా కస్టమర్లు నేరుగా తమ ఫిర్యాదును వినియోగదారుల ఫోరమ్‌కు తీసుకెళ్లవచ్చు . ఈ విధానాన్ని..

Telecom Services: మొబైల్‌ ఫోన్‌ కస్టమర్ల సేవా సమస్యల ఫిర్యాదుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 28, 2022 | 10:35 AM

Telecom Services: టెలికాం సేవలలో లోపానికి సంబంధించి ఒక కంపెనీకి వ్యతిరేకంగా కస్టమర్లు నేరుగా తమ ఫిర్యాదును వినియోగదారుల ఫోరమ్‌కు తీసుకెళ్లవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 ప్రకారం మధ్యవర్తిత్వ పరిష్కారం చట్టబద్ధమైనదని, అలాంటి అంశాలు వినియోగదారుల ఫోరమ్ పరిధికి వెలుపల ఉండవని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వినియోగదారుడు మధ్యవర్తిత్వ మార్గంలో వెళ్లాలనుకుంటే అది అనుమతించదగినదేనని, అయితే చట్టం ప్రకారం.. అలా చేయడం తప్పనిసరి కాదని ధర్మాసనం పేర్కొంది. వినియోగదారుల రక్షణ చట్టం కింద ఉపయోగించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. 2019 చట్టం కొత్త నిబంధనలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. టెలికాం కంపెనీ వొడాఫోన్ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ ఆదేశాలను సవాలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

ఏ కేసులో విచారణ నిర్ణయించబడింది?

అజయ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి మే 25, 2014న అహ్మదాబాద్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌లో వొడాఫోన్ సేవలలో లోపం ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. అగర్వాల్‌కు పోస్ట్ పెయిడ్ మొబైల్ కనెక్షన్ ఉంది. దీని నెలవారీ రుసుము రూ. 249గా వొడాఫోన్ అగర్వాల్‌కు మొబైల్ సేవలను అందిస్తోంది. క్రెడిట్ కార్డు ద్వారా కంపెనీ బిల్లులు చెల్లించేందుకు అగర్వాల్ ‘ఆటో పే’ విధానాన్ని తీసుకున్నారు. వోడాఫోన్‌కి దాని చెల్లింపు చివరి తేదీకి ముందే చేయబడుతుంది. నవంబర్ 8, 2013 నుండి డిసెంబర్ 7, 2013 వరకు తన సగటు నెలవారీ బిల్లు రూ.555 అని అగర్వాల్ ఆరోపించారు. కానీ రూ.24,609.51 బిల్లు వసూలు చేశారు. ఈ విషయమై జిల్లా వినియోగదారుల ఫోరంలో అగర్వాల్ విజ్ఞప్తి చేయగా, వడ్డీతో కలిపి రూ.22 వేలు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. టెలికాం రంగంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో కస్టమర్‌ వినియోగదారులు ఫోర్‌కు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

Escalators: ఎస్కలేటర్‌కు రెండు వైపులా బ్రష్‌లు ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటో తెలుసుకోండి

Smartphone Brightness: స్మార్ట్‌ఫోన్‌లో ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..? దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోండి