Smartphone Brightness: స్మార్ట్‌ఫోన్‌లో ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..? దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోండి
Smartphone Brightness Feature: స్మార్ట్‌ఫోన్‌లలో 'ఆటో బ్రైట్‌నెస్' అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ వినియోగదారుల మొబైల్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఎప్పుడు పెంచాలి.. ఎప్పుడు తగ్గించాలో..
Smartphone Brightness Feature: స్మార్ట్‌ఫోన్‌లలో ‘ఆటో బ్రైట్‌నెస్’ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ వినియోగదారుల మొబైల్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఎప్పుడు పెంచాలి.. ఎప్పుడు తగ్గించాలో నిర్ణయిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు Android, iOS ప్లాట్‌ఫారమ్‌లు రెండింటిలోనూ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లే కాకుండా ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్స్‌లలో కూడా దీని వినియోగం పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్ (Brightness Feature) ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు లేదా ఎక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాలలో మీ మొబైల్ స్క్రీన్ బ్రైట్‌నెస్ పెరగడం అనేది తరచుగా చూస్తుంటారు. అదే సమయంలో రాత్రి సమయంలో స్క్రీన్ వెలుతురు మందగిస్తుంది. దీనికి కారణం ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్. బ్రైట్‌నెస్ ఎప్పుడు పెంచాలో, ఎప్పుడు తగ్గించాలో స్మార్ట్‌ఫోన్‌కు ఎలా తెలుసో ఇప్పుడు తెలుసుకుందాం. గాడ్జెట్స్ నివేదిక ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌లలో ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, బేరోమీటర్ వంటి అనేక రకాల సెన్సార్‌లు ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. వీటిలో ఒకటి యాంబియంట్ లైట్ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ సహాయంతో ఈ ఫీచర్ పని చేస్తుంది.
స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన యాంబియంట్ లైట్ సెన్సార్ మొబైల్ చుట్టూ ఎప్పుడు వెలుతురు ఉందో, ఎప్పుడు లేదో గుర్తించగలదు. ఇది కెమెరాలా పనిచేస్తుంది. ఇది మొబైల్ చుట్టూ ఉన్న కాంతిని లెక్కిస్తుంది. ఇలా కాంతిని పెంచడం తగ్గించడం అనేది చేసేలా పని చేస్తుంది. ‘అడాప్టివ్ బ్రైట్‌నెస్’ ఫీచర్ పిక్సెల్, కొన్ని సామ్‌సంగ్ ఫోన్‌లలో కూడా అందించబడింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బ్రైట్‌నెస్ సర్దుబాటు చేస్తుంది. అదే సమయంలో ఆపిల్‌లో ఉన్న ట్యూన్ టోన్ ఫీచర్ కూడా ఇలా చేయడానికి సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి: