Tiger Viral Video: రెండు పులుల భీకరపోరు.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో.. మగపులి మృతి..!
Tigers Viral Video: అడవి ప్రపంచంలో అనునిత్యం రక్తపాతం కొనసాగుతూనే ఉంటుంది. చిన్న జీవులను.. పెద్ద జీవులు.. పెద్ద జీవులను.. క్రూర జంతువులు వేటాడుతుంటాయి. అరణ్యంలో బలహీన జంతువులపై క్రూరమృగాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది. అయితే..
మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గడ్చిరోలి జిల్లా ఆళ్లపల్లి అడవుల్లో ఓ పులి మృతిచెందింది. పులి కళేబరాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు..మృతిచెందినది మగ పులి అని.. దాని వయసు ఒకటిన్నర సంవత్సరాలు ఉంటుందని నిర్ధారించారు. రెండు పులుల మద్య జరిగిన దాడిలో ఏడాదిన్నర వయస్సున్న మగ పులి మృతిచెందినట్లుగా అధికారులు చెబుతున్నారు.మగ పులి శరీరంపై కనిపించిన గాయాల ఆధారంగా రెండు పులుల మద్య దాడిగా నిర్దారించారు అటవిశాఖ అధికారులు. గత నెల ఇదే ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి పులి మృతిచెందటంతో.. అలర్ట్ అయిన అటవిశాఖ.. ట్రాప్ కెమెరాలు అమర్చారు. దాంతో టైగర్ టెరిటోరియల్ ఫైట్ ఆ కెమెరాల్లో రికార్డైంది . మృతిచెందిన పులికి అంత్యక్రియలు నిర్వహించారు అటవిశాఖ అధికారులు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Published on: Mar 01, 2022 09:56 AM
వైరల్ వీడియోలు
Latest Videos