Viral Video: తాజ్ మహల్ వద్ద చక్కర్లు కొట్టిన విమానం.. నెట్టింట్లో వీడియో వైరల్..
Viral Video: ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్(Taj Mahal) దేశంలో అత్యంత ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ప్రదేశం. ఇది ప్రపంచ వింతల్లో ఒకటి కూడా కావడం విశేషం. దీని భద్రతకు భారత ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు, నియమనిబంధనలు చేసింది.
Viral Video: ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్(Taj Mahal) దేశంలో అత్యంత ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ప్రదేశం. ఇది ప్రపంచ వింతల్లో ఒకటి కూడా కావడం విశేషం. దీని భద్రతకు భారత ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు, నియమనిబంధనలు చేసింది. కానీ.. తాజ్‌మహల్‌కు అత్యంత సమీపంగా ఒక విమానం చక్కర్లు(Flight Travel) కొట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీని భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పర్యవేక్షిస్తూ ఉంటుంది. తాజాగా విమానం చక్కర్లు కొట్టిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారటంతో ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. అసలు ఈ వీడియోపై పూర్తి స్థాయి నివేధిక ఇవ్వాలని సీఐఎస్ఎఫ్ ను కోరింది.
విమానాలు అక్కడ తిరగటం ఎందుకు నిషిద్ధం..
తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్లోన్ల పై కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలను(No flying Zone) విధించింది. ఈ తరుణంలో టూరిస్టులు కొంత ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. మొఘల్ చక్రవర్తి షాజ్‌హాన్ ఉరుసు ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇవి మూడు రోజులు జరుగుతాయి. ఈ క్రమంలో ఓ విమానం తాజ్ మహల్ కు అత్యంత సమీపంలో విహరించటినట్లు ఉన్న వీడియో వైరల్ గా మారింది. దీనిపై వెంటనే అప్రమత్తమైన ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ చర్యలు చేపట్టింది. దీనిపై సీఐఎస్ఎఫ్ అధికారుల నుంచి రాతపూర్వక నివేదికను కోరినట్లు తెలిపింది. నెట్టింట్లో వైరస్ గా మారిన వీడియోను మీరే చూడండి..
An aircraft was spotted in the no flying zone of the Taj Mahal, security agencies at the monument shocked.#TajMahal #Agra #ViralVideo pic.twitter.com/cUdCoZxs5f
— Knowledge Flow (@knowledgeflow1) February 28, 2022
ఇవీ చదవండి..
Skoda Slavia1.0 TSI: వాహన ప్రియుల కోసం స్కోడా కొత్త సెడాన్.. అదిరిపోయే ఫీచర్లతో అందుబాటులోకి..