Skoda Slavia1.0 TSI: వాహన ప్రియుల కోసం స్కోడా కొత్త సెడాన్.. అదిరిపోయే ఫీచర్లతో అందుబాటులోకి..
Skoda Slavia1.0 TSI: జర్మన్ కామ్ మేకర భారత మార్కెట్ లోకి తన సరికొత్త మోడల్ కారును అందుబాటులోకి తెచ్చింది. సెడాన్ సెగ్మెంట్‌లో మరింత పోటీకి తెరతీస్తూ స్కోడా ఆటో ఇండియా(Skoda Auto India) తన స్లావియా కారును తీసుకొచ్చింది.
Skoda Slavia1.0 TSI: జర్మన్ కామ్ మేకర భారత మార్కెట్ లోకి తన సరికొత్త మోడల్ కారును అందుబాటులోకి తెచ్చింది. సెడాన్ సెగ్మెంట్‌లో మరింత పోటీకి తెరతీస్తూ స్కోడా ఆటో ఇండియా(Skoda Auto India) తన స్లావియా కారును తీసుకొచ్చింది. ప్రస్తుతం దీని ఎక్స్ షోరూం(Delhi Ex-show Room) ప్రారంభ ధర రూ. 10.69 లక్షల నుంచి అత్యధికంగా రూ. 15.39 లక్షలుగా ఉంది. నెలకు 2,500–3,000 యూనిట్లు అమ్మాలని కంపెనీ లక్ష్య్ంగా నిర్థేశించుకున్నట్లు బ్రాండ్ డైరెక్టర్ జాక్ హాలిస్ వెల్లడించారు. ఈ విభాగంలో వినియోగదారుల ప్రధమ ఎంపికగా మారేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 179 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ బ్రేక్ డిస్క్ క్లీనింగ్, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్, హిల్–హోల్డ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి వస్తోంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇది మూడు వేేరియంట్లలో వాహన ప్రియులకు లభిస్తోంది.
ఇవీ చదవండి..
Interest Rates: కొత్తగా జనవరి తరువాత బ్యాంక్ లోన్ తీసుకున్నారా.. అయితే ఈ వివరాలు మీకోసమే..
BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ.