Alert For Customers‌: మార్చి నెలలో పెరిగిన ధరలు.. మారిన నిబంధనలు.. నిర్లక్ష్యం చేస్తే మీ జేబుకు చిల్లే..!

Alert For Customers‌: ఫిబ్రవరి 2022 కనిష్ట నెల ముగిసింది. మార్చి నెలలో మీపై ప్రత్యక్ష ప్రభావం చూపే అనేక పెద్ద మార్పులు ఉంటాయి. మార్చి మొదటి తేదీ నుండి పాల (Milk) కొనుగోలు..

Alert For Customers‌: మార్చి నెలలో పెరిగిన ధరలు.. మారిన నిబంధనలు.. నిర్లక్ష్యం చేస్తే మీ జేబుకు చిల్లే..!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 01, 2022 | 8:21 AM

Alert For Customers‌: ఫిబ్రవరి 2022 కనిష్ట నెల ముగిసింది. మార్చి నెలలో మీపై ప్రత్యక్ష ప్రభావం చూపే అనేక పెద్ద మార్పులు ఉంటాయి. మార్చి మొదటి తేదీ నుండి పాల (Milk) కొనుగోలు ఖరీదైనది కాగా, ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చి 1న ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ (LPG Gas Cylinder) ధరలను విడుదల చేశాయి. గ్యాస్‌ ధరలు ఢిల్లీలో పెరిగాయి. ఇది కాకుండా మార్చి నెలలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ( IPPB )లో డిజిటల్ సేవింగ్స్ ఖాతాను మూసివేయడానికి ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ నెలలో ఫైనాన్స్‌కి సంబంధించిన కొన్ని విషయాల గడువు కూడా ఉంది.

అమూల్ పాలు ధరలు

మార్చి 1 నుంచి అమూల్‌ పాల ధర పెరిగింది. లీటరు పాల ధర రూ.2 పెరిగింది. ఇప్పుడు వినియోగదారులు అర లీటర్ అమూల్ గోల్డ్‌కు రూ.30, అమూల్ రూ.24, అమూల్ శక్తికి రూ.27 చెల్లించాల్సి ఉంటుంది. లీటరుకు ఈ రూ.2 పెంచామని, ఇది సగటు ఆహార ద్రవ్యోల్బణం కంటే చాలా తక్కువని అమూల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఛార్జీలు 

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను మూసివేయడానికి, మీరు రూ. 150తో పాటు జీఎస్టీని చెల్లించాలి. కొత్త రూల్ 5 మార్చి 2022 నుండి అమలులోకి వస్తుంది. KYCని అప్‌డేట్ చేయనందున డిజిటల్ సేవింగ్స్ ఖాతా ఒక సంవత్సరం తర్వాత మూసివేయబడినట్లయితే మాత్రమే ఈ ఛార్జీ వర్తిస్తుంది. IPPBలో ప్రారంభించిన డిజిటల్ ఖాతాతో వినియోగదారులు ఆన్‌లైన్ లావాదేవీల సౌకర్యాన్ని కూడా పొందుతారు. IPPB ఖాతాతో మీరు ఏదైనా పోస్టాఫీసు ఖాతాలో సులభంగా డబ్బును ఆన్‌లైన్‌లో జమ చేయవచ్చు.

LPG గ్యాస్ సిలిండర్ ధరలు

LPG గ్యాస్ సిలిండర్ ధరలు విడుదల చేశాయి. మార్చి 1న 14 కిలోల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులేకపోగా, 19కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రం ఢిల్లీలో రూ.105 పెరిగింది. న్యూఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌ ధర రూ.2,012గా ఉంది. ఈ కొత్త ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక 5 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర కూడా పెరిగింది. ఢిల్లీలో ఐదు కిలోల గ్యాస్‌ ధర రూ.569 ఉంది.

 పాన్-ఆధార్ లింక్ చేయడానికి గడువు:

ఇక పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఈ రెండు ముఖ్యమైన పత్రాలను అనుసంధానం చేయకపోతే (పాన్-ఆధార్ కార్డ్ లింక్) ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రభుత్వం 2022 మార్చి 31ని గడువుగా నిర్ణయించింది. మార్చి 31లోగా ఆధార్ మరియు పాన్ లింక్ చేయకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B కింద రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్ ఖాతాలో KYCని నవీకరించడం అవసరం

RBI డిసెంబర్‌లో KYC అప్‌డేట్ గడువును మార్చి 31, 2022 వరకు పొడిగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 ముగిసే వరకు కేవైసీ విషయంలో కస్టమర్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్‌బీఐ ఆర్థిక సంస్థలకు సూచించింది.

ఇవి కూడా చదవండి:

Hindustan Unilever: డిటర్జెంట్ పౌండర్, సబ్బుల ధరలు మరింత ప్రియం

ITR Verify: పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన అలర్ట్.. ఐటీఆర్‌ ఇ-వెరిఫై చేసుకోండిలా..!