Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindustan Unilever: డిటర్జెంట్ పౌండర్, సబ్బుల ధరలు మరింత ప్రియం

Hindustan Unilever: ఫిబ్రవరి నెలలో సామాన్యులకు ద్రవ్యోల్బణం గట్టి షాక్ తగిలింది. దేశంలోని అతిపెద్ద FMGC కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ ఫిబ్రవరిలో లైఫ్‌బాయ్, లక్స్, పియర్స్ సబ్బులతో..

Hindustan Unilever: డిటర్జెంట్ పౌండర్, సబ్బుల ధరలు మరింత ప్రియం
Follow us
Subhash Goud

|

Updated on: Mar 01, 2022 | 7:55 AM

Hindustan Unilever: ఫిబ్రవరి నెలలో సామాన్యులకు ద్రవ్యోల్బణం గట్టి షాక్ తగిలింది. దేశంలోని అతిపెద్ద FMGC కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ ఫిబ్రవరిలో లైఫ్‌బాయ్, లక్స్, పియర్స్ సబ్బులతో పాటు సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండీషనర్, డోవ్ బాడీ వాష్ వంటి బ్రాండ్‌ల స్టాక్ కీపింగ్ యూనిట్ల ధరలను మరింత పెంచింది. బ్రోకరేజ్ ఎడెల్వీస్ సెక్యూరిటీస్ తన ఛానెల్ ప్రకారం.. HUL ప్రొడక్ట్‌ల ధరలు 1-9 శాతం పెరిగాయి. ఫిబ్రవరి నెలలో HUL ధరలు పెంచడం ఇది రెండోసారి. ఎడెల్‌వీస్ సెక్యూరిటీస్‌లోని ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవనీష్ రాయ్ వివరాల ప్రకారం.. హిందుస్థాన్ యూనిలీవర్ ఫిబ్రవరి చివరిలో మరో ధరను పెంచింది.ఇటీవల అనేక SKUలలో సర్ఫ్ ఎక్సెల్ మాటిక్, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండీషనర్, డోవ్ బాడీ వాష్, లైఫ్‌బాయ్, లక్స్, పియర్స్ సోప్స్, రిన్ ధరలు పెరిగాయి.

2 వారాల క్రితం ధర 10 శాతం పెరిగింది:

మింట్’ నివేదిక ప్రకారం.. రెండు వారాల క్రితం హిందూస్థాన్ యూనిలీవర్ సబ్బులు, డిటర్జెంట్లు, డిష్‌వాషింగ్ ఉత్పత్తుల ధరలను 3 నుండి 10 శాతం పెంచింది. సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ డిటర్జెంట్, సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్, విమ్ బార్, లిక్విడ్ అలాగే లక్స్, రెక్సోనా సబ్బులు, పాండ్స్ టాల్కమ్ పౌడర్‌లో ఈ పెరుగుదల ఉంది.

డిసెంబర్ త్రైమాసికంలో లాభాలు పెరిగాయి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ వ్యాపారం అద్భుతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 2021తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభాన్ని 18.68 శాతంగా రూ.2,300 కోట్లుగా నివేదించింది. దీంతో క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.1,938 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. హిందూస్థాన్ యూనిలీవర్ బ్రిటిష్ కంపెనీ యూనిలీవర్‌కి అనుబంధ సంస్థ. హిందూస్థాన్ యూనిలీవర్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. హిందూస్తాన్ యూనిలీవర్ అనేక ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇందులో ప్యాక్ చేసిన ఆహారం, నూనెలు, సబ్బులు, పానీయాలు, సౌందర్య ఉత్పత్తులు మొదలైన రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

TS Traffic Challans: నేటి నుంచి వాహనదారులకు బంపర్‌ ఆఫర్‌.. పెండింగ్‌ చలనాలపై భారీ రాయితీ

Amul Milk: అమూల్ పాల ధరలు మరింత ప్రియం.. ఎంత పెరగనున్నాయంటే..