Amul Milk: అమూల్ పాల ధరలు మరింత ప్రియం.. ఎంత పెరగనున్నాయంటే..
దేశవ్యాప్తంగా మార్కెట్‌లో లీటరు పాల ధరను పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకుంది.
Amul Milk: దేశవ్యాప్తంగా మార్కెట్‌లో లీటరు పాల(Milk) ధరను రూ.2 పెంచుతూ అమూల్(Amul) నిర్ణయం తీసుకుంది. తాజా ధరల ప్రకారం, ఇప్పుడు మార్చి 1, మంగళవారం నుంచి అంటే అహ్మదాబాద్, సౌరాష్ట్ర (గుజరాత్) మార్కెట్లలో, అమూల్ గోల్డ్ మిల్క్ ధర 500 మి.లీకి 30 రూపాయలు కానుంది. అమూల్ తాజా 500 మి.లీకి 24 రూపాయలు అవుతుంది. ఇక అమూల్ శక్తి 500 మి.లీ.కి 27 రూపాయలకు చేరుకుంటుంది. జూలై 2021లో కూడా అముల్ పాల ధరలు పెరిగాయి. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ అసోసియేషన్ ఒక సంవత్సరం పూర్తి కాకుండానే పాల ధరలను పెంచింది. అంతకుముందు జూలై 2021లో పాల ధరలను పెంచారు. పెరిగిన ధరలు సోనా, తాజా, శక్తి, టి-స్పెషల్, అలాగే ఆవు .. గేదె పాలతో సహా అన్ని బ్రాండ్‌ల అమూల్ పాలపై వర్తిస్తాయి. దాదాపు 7 నెలల 27 రోజుల తర్వాత ధరలు పెంచుతున్నారు. ఉత్పత్తి ధరల పెరుగుదల కారణంగా ఈ పెంపుదల జరుగుతోందని కంపెనీ తెలిపింది.
రెండేళ్లలో 4 శాతం పెరుగుదల..
అమూల్ 2 సంవత్సరాలలో సంవత్సరానికి 4% ధరను పెంచింది GCMF ప్రకారం, గత 2 సంవత్సరాలలో, అమూల్ తన తాజా పాల శ్రేణి ధరలను సంవత్సరానికి 4% పెంచింది. ప్యాకేజింగ్, లాజిస్టిక్స్, పశుగ్రాసం ధరల పెరుగుదల కారణంగా ధరల పెరుగుదల అనివార్యం అయిందని కంపెనీ చెబుతోంది.
మిల్క్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం, వినియోగదారుల నుంచి స్వీకరించే ప్రతి రూ.లో దాదాపు 80 పైసలు పాల ఉత్పత్తికి పంపిణీ చేస్తుంది. ఈ విధంగా, ఇప్పుడు ధరలు పెరగడం పశువుల రైతులను మరింత పాల ఉత్పత్తికి ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
AMUL increases the price of milk by Rs 2. The prices will come into effect from tomorrow (March 1, 2022) pic.twitter.com/R2IeDQFtOo
— ANI (@ANI) February 28, 2022
ఇవి కూడా చదవండి: Madhabi Puri Buch: సెబీ తొలి ఛైర్‌పర్సన్‌గా మాధబి పూరి బుచ్.. అజయ్ త్యాగి స్థానంలో నియామకం..
Russia-Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. అయ్యయ్యో వోడ్కాకు పెద్ద కష్టమే వచ్చి పడిందే