Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 389, నిఫ్టీ 136 పాయింట్లు అప్..

మెటల్ స్టాక్స్‌లో బలమైన కొనుగోళ్లతో స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ BSE సెన్సెక్స్ 389 పాయింట్లు పెరిగి..

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 389, నిఫ్టీ 136 పాయింట్లు అప్..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 28, 2022 | 6:23 PM

మెటల్ స్టాక్స్‌లో బలమైన కొనుగోళ్లతో స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ BSE సెన్సెక్స్ 389 పాయింట్లు పెరిగి 56,247 వద్ద ముగిసింది. నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 16,794 వద్ద స్థిరపడింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతాయన్న వార్తలతో పెట్టుబడిదారులు ఆశాజనకంగా మారారు. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.97 శాతం, స్మాల్ క్యాప్ షేర్లు శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు సానుకూలంగా ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌15 సెక్టార్ గేజ్‌లలో 10 సెక్టర్లు పెరిగాయి. నిఫ్టీ మెటల్ 4.95 శాతం పెరిగింది.

హిండాల్కో నిఫ్టీలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ స్టాక్ 7.16 శాతం పెరిగి రూ. 572.15కి చేరుకుంది. టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్ కూడా లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కనీసం 200 ఫ్యూచర్ రిటైల్ స్టోర్లను స్వాధీనం చేసుకోనుందన్న నివేదికలతో ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల షేర్లు పెరిగాయి. మరోవైపు, బ్యాంక్ నిఫ్టీకి 35,500 పాయింట్లకు చేరుకుంది. BSEలో, 2,120 షేర్లు పెరగగా, 1,323 షేర్లు తగ్గాయి. 30 షేర్ల బిఎస్‌ఇ ఇండెక్స్‌లో టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, ఎన్‌టిపిసి, ఎల్ అండ్ టి, ఏషియన్ పెయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ లాభపడ్డాయి.

Read Also.. Madhabi Puri Buch: సెబీ తొలి ఛైర్‌పర్సన్‌గా మాధబి పూరి బుచ్‌.. అజయ్ త్యాగి స్థానంలో నియామకం..