Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhabi Puri Buch: సెబీ తొలి ఛైర్‌పర్సన్‌గా మాధబి పూరి బుచ్‌.. అజయ్ త్యాగి స్థానంలో నియామకం..

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) ఛైర్మన్‌గా తొలిసారి ఓ మహిళకు అవకాశం దక్కింది...

Madhabi Puri Buch: సెబీ తొలి ఛైర్‌పర్సన్‌గా మాధబి పూరి బుచ్‌.. అజయ్ త్యాగి స్థానంలో నియామకం..
Madhabi Puri Buch
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 28, 2022 | 5:44 PM

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (sebi) ఛైర్మన్‌గా తొలిసారి ఓ మహిళకు అవకాశం దక్కింది. మాధబి పూరి బుచ్‌(Madhabi Puri Buch)ను సెబీ ఛైర్‌పర్సన్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుత ఛైర్మన్‌ అజయ్‌ త్యాగి(Ajay Tyagi) పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో సెబీ మాజీ సభ్యురాలుగా ఉన్న పూరీ బుచ్‌ను నియమించారు. కేపిటల్‌ మార్కెటింగ్‌ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీకి ఛైర్‌పర్సన్‌గా ఓ మహిళను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మూడేళ్ల పాటు ఆమె ఈ పదవిలో ఉండే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో తన కెరీర్‌ను ప్రారంభించిన మాధవి.. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆ గ్రూప్‌లో పనిచేశారు. అదే సమయంలో 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే మధ్య కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు ఎండీగా, సీఈవోగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

2017 నుంచి 2021 మ‌ధ్య కాలంలో సెబీ పూర్తి స్థాయి మెంబ‌ర్‌గా ప‌ని చేశారు. అజ‌య్ త్యాగి 2017, మార్చి 1న‌ సెబీ ఛైర్మన్‌గా నియామ‌కం అయ్యారు. క‌రోనా నేప‌థ్యంలో 2020 ఫిబ్రవ‌రిలో తొలుత ఆరు నెల‌లు, ఆగ‌స్టులో 18 నెల‌ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. గ‌తేడాది అక్టోబ‌ర్ 28న సెబీ కొత్త ఛైర్మన్ నియామ‌కానికి అర్హులైన‌ అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తూ కేంద్ర ఆర్థిక‌శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. డిసెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించింది. అనంత‌రం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి షార్ట్ లిస్ట్‌ను ఫైనాన్షియ‌ల్ సెక్టార్ రెగ్యులేట‌రీ అపాయింట్‌మెంట్స్ సెర్చ్ క‌మిటీ (FSRASC) విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ఉన్నవారికి ఇంట‌ర్వ్యూలు నిర్వహించింది. చివ‌ర‌కు మ‌ధాబినే సెబీ ఛైర్మన్ ప‌ద‌వి వ‌రించింది.

Read Also. LIC IPO PAN Linking: మీరు ఎల్‌ఐసీ పాలసీదారులా.. పాన్ కార్డు లింకింగ్‌కు ఈ రోజే చివరి తేదీ..