LIC IPO PAN Linking: మీరు ఎల్‌ఐసీ పాలసీదారులా.. పాన్ కార్డు లింకింగ్‌కు ఈ రోజే చివరి తేదీ..

LIC Alert: మార్కెట్‌లోకి ఎల్ఐసీ – ఐపీఓ పాలసీ మార్చిలో రాబోతుంది. ఈ క్రమంలో ఎల్ఐసీ పాలసీదారులకు.. కార్పోరేషన్ అలెర్ట్ జారీ చేసింది...

LIC IPO PAN Linking: మీరు ఎల్‌ఐసీ పాలసీదారులా..  పాన్ కార్డు లింకింగ్‌కు ఈ రోజే చివరి తేదీ..
Lic Ipo
Follow us

|

Updated on: Feb 28, 2022 | 5:12 PM

LIC Alert: మార్కెట్‌లోకి ఎల్ఐసీ – ఐపీఓ పాలసీ మార్చిలో రాబోతుంది. ఈ క్రమంలో ఎల్ఐసీ పాలసీదారులకు.. కార్పోరేషన్ అలెర్ట్ జారీ చేసింది. ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వారు.. మందు పాలసీని పాన్ కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి ఈ రోజే చివరి తేదీ. ఫిబ్రవరి 28 లోగా లింక్ చేసుకోవాలని ఎల్ఐసీ ఖాతాదారులకు సూచించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Life Insurance Corporation) ఐపిఓ పాలసీ త్వరలో మార్కెట్‌లోకి రానున్న నేపథ్యంలో మరోసారి ప్రకటనను విడుదల చేసింది. LIC పాలసీదారులు వారి PAN కార్డ్‌లను లింక్ చేయకుంటే LIC IPOకి సభ్యత్వం పొందలేరని పేర్కొంది.

కార్పొరేషన్ పాలసీదారులు వారి పాన్ వివరాలు పాలసీ రికార్డులలో వీలైనంత త్వరగా లింక్ చేసుకోవాలని పేర్కొంది. SEBIకి ఈ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన తేదీ నుంచి రెండు వారాల గడువు ముగిసేలోపు (అంటే, ఫిబ్రవరి 28, 2022 నాటికి) తమ కార్పొరేషన్‌లో వారి పాన్ వివరాలను అప్‌డేట్ చేయని పాలసీదారులను దీనికి అర్హులుగా పరిగణించరని అని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

LIC IPO లేదా ఏదైనా IPO కొనుగోలు చేయడానికి ఎవరైనా డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి. డీమ్యాట్ ఖాతా అంటే మీ సెక్యూరిటీలు డిజిటల్‌గా ఉంటాయి. LIC IPO తేదీ 2022 మార్చిలో ప్రకటించనున్నారు. IPO భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ క్యాప్‌తో LIC కంపెనీగా మారనుంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ (FE) నివేదిక ప్రకారం.. వారి పేరు మీద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాలసీలు ఉన్న పాలసీదారులు ‘పాలసీ హోల్డర్ రిజర్వేషన్ పాలసీ’ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

LIC పాలసీతో పాన్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలి

LIC అధికారిక వెబ్‌సైట్ www.licindia.in లోకి లాగిన్ అవ్వండి

హోమ్‌పేజీలో ‘ఆన్‌లైన్ పాన్ రిజిస్ట్రేషన్’ ట్యాబ్‌ను ఎంచుకోండి

‘ప్రొసీడ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

యోన్ ఈ వివరాలను నమోదు చేయాలి – ఇ-మెయిల్ ID, PAN నంబర్, మొబైల్ ఫోన్ నంబర్, పాలసీ నంబర్

ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి, ‘గెట్ OTP’పై క్లిక్ చేయండి

స్క్రీన్‌పై ఇచ్చిన బాక్స్‌లో మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి

సబ్మిట్ పై క్లిక్ చేయండి.. ఆ తర్వాత స్క్రీన్‌పై సందేశం కనిపిస్తుంది.

Read Also.. ePAN: ఆధార్ కార్డ్ వినియోగించి నిమిషాల్లో పాన్ కార్డు పొందడానికి ఇలా చేయండి..