ePAN: ఆధార్ కార్డ్ వినియోగించి నిమిషాల్లో పాన్ కార్డు పొందడానికి ఇలా చేయండి..

ePAN: ఈ రోజుల్లో ఆధార్ కార్డు(Aadhaar card), పాన్ కార్డు, ఓటర్ కార్డు(Voter card) లాంటివి ప్రతి ఒక్కరికీ గుర్తింపు సాధనాలుగా అధికారికంగా దేశంలో వినియోగిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ కార్యక్రమాలను పొందడానికి కూడా ఇవి తప్పని సరిగా మారాయి

ePAN: ఆధార్ కార్డ్ వినియోగించి నిమిషాల్లో పాన్ కార్డు పొందడానికి ఇలా చేయండి..
Epan
Follow us

|

Updated on: Feb 28, 2022 | 12:13 PM

ePAN: ఈ రోజుల్లో ఆధార్ కార్డు(Aadhaar card), పాన్ కార్డు, ఓటర్ కార్డు(Voter card) లాంటివి ప్రతి ఒక్కరికీ గుర్తింపు సాధనాలుగా అధికారికంగా దేశంలో వినియోగిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ కార్యక్రమాలను పొందడానికి కూడా ఇవి తప్పని సరిగా మారాయి. ఇప్పుడు మీకు ఇవన్నీ ఉన్నయా? ఒక వేళ లేకపోతే మీరు ఇప్పుడు వాటిని సదరు సంస్థల అధికారిక వెబ్ సైట్లలో పొందేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. మీరు ఒక వేళ ఆధార్ కార్డు కలిగిఉంటే.. మీరు ఈ-పాన్ పొందడానికి ఆధార్ నంబరును ఇలా వినియోగించుకోవచ్చు. మీరు తక్షణం ఈ పాన్ పొందాలనుకుంటున్నారా. అయితే మీ ఆధార్ కార్డును వినియోగించి ఇప్పుడు మీరు దానిని ఎక్కడి నుంచైనా పొందవచ్చు. దీనికోసం ఆధాయపన్ను శాఖ వెబ్ సైట్ incometaxindia.gov.in లోకి వెళ్లవలసి ఉంటుంది.

అయితే దీనికి ముందు మీరు గుర్తుంచుకోవలసి విషయాలు ఏమిటంటే.. ఇలా చేయాలంటే మీకు ఇంతకుముందు పాన్ కార్డు ఉండకూడదు. పైగా మీరు తాజా వివరాలతో కూడిన వ్యాలీడ్ ఆధార్ కార్డును కలిగి ఉండాలి. ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయాలంటే ముందుగా దేశంలో UIDAI అందించే ఆధార్ కార్డు తప్పనుసరి. కనీసం ఒక బ్యాంకు ఖాతా తెరవాలన్నా ఇది ఇప్పుడు తప్పని సరి. అదే విధంగా పాన్ కార్డును ఆదాయపన్ను శాఖ ఇస్తుంది. అందువల్ల ఈ-పాన్ పొందేందుకు డిజిటల్ గా సైన్ చేసిన పాన్ కార్డును ఆదాయపన్ను శాఖ అందిస్తోంది.

మీ పాన్ కార్డు వినియోగించి ఈ-పాన్ పొందడానికి ఇలా చేయండి..

1. ముందుగా ఆదాయపన్ను శాఖకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ incometaxindia.gov.in కు లాగిన్ అవ్వాలి.

2. ఆ తరువాత హోం పేజ్ లోని Quick Linksలో ఉండే Instant ePAN ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

3. ఆ తరువాత ఓపెన్ అయ్యే పేజీలో Get New ePAN ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

4. ఆ తరువాత అక్కడ మీ ఆధార్ నంబరు వివరాలు నింపి కన్ఫమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. Continue ఆప్షన్ ఎంచుకోవాలి.

5. ఆ తరువాత మీ మెుబైల్ నంబర్ కు ఆధార్ ఓటీపీ నంబర్ వస్తుంది. దానిని పొందుపరిచి వ్యాలిడేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

6. ఆ తరువాత కండిషన్స్ పేజ్ వస్తుంది.. Continue ఆప్షన్ ఎంచుకోవాలి.

7. ఆ తరువాత అక్కడ ఉండే కండిషన్స్ చెక్ బాక్స్ పై టిక్ మార్క్ చేసి.. Continue ఆప్షన్ ఎంచుకోవాలి.

8. ఇక్కడ మీ ఈ మెయిల్ వివరాలు ఇచ్చి.. Continue ఆప్షన్ ఎంచుకోవాలి.

9. ఇక్కడ మీ ఆధార్ నంబర్ తో మీకు పాన్ ఎలాట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు.

10. ఇప్పుడు Check status/Download PAN ఎంచుకుని ఆధార్ వివరాలు, సెక్యూరిటీ క్యాప్చీ నింపి ఆ తరువాత ఓటీపీ వివరాలు అందించాలి.

11. దీంతో 10 నిమిషాల్లో మీ ఈ-పాన్ కు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ లింక్ వస్తుంది. అలా మీరు డిజిటల్ పాన్ కార్డును నిమిషాల వ్యవధిలో పొందవచ్చు.

ఇవీ చదవండి..

EPF Alert: ఇకపై వారు రెండవ పీఎఫ్ ఖాతా ఓపెన్ చేయాల్సిందే.. ఎందుకో ఆ 5 కీలక అంశాలు తెలుసుకోండి..

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో మనవాళ్ల దుస్థితి కలవరపెడుతోంది.. వీడియోను ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ