Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF Alert: ఇకపై వారు రెండవ పీఎఫ్ ఖాతా ఓపెన్ చేయాల్సిందే.. ఎందుకో ఆ 5 కీలక అంశాలు తెలుసుకోండి..

EPF Alert: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) 2021 బడ్జెట్‌లో పీఎఫ్ ఒక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ చెల్లించేవారిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పెట్టుబడిదారులు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.

EPF Alert: ఇకపై వారు రెండవ పీఎఫ్ ఖాతా ఓపెన్ చేయాల్సిందే.. ఎందుకో ఆ 5 కీలక అంశాలు తెలుసుకోండి..
Pf Nominee
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 28, 2022 | 11:30 AM

EPF Alert: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) 2021 బడ్జెట్‌లో పీఎఫ్ ఒక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ చెల్లించేవారిపై పన్ను విధించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కూడా గత సంవత్సరం అదనపు EPF చెల్లింపుల ద్వారా వచ్చే వడ్డీపై పన్ను విధించడానికి సంబంధించి కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం.. సబ్-రూల్ (1) కింద పన్ను విధించదగిన వడ్డీని లెక్కించడం కోసం పీఎఫ్ ఖాతాలోని ప్రత్యేక ఖాతాలు మునుపటి సంవత్సరం 2021-2022లో, అన్ని తరువాతి సంవత్సరాల్లో పన్ను చెల్లించదగిన కంట్రిబ్యూషన్, నాన్-టాక్సబుల్ కంట్రిబ్యూషన్ కోసం పరిగణలోకి తీసుకోబడతాయని వెల్లడించింది.

దీనికి సంబంధించి తెలుసుకోవలసిన 5 కీలక అంశాలు..

1. పీఎఫ్ ఖాతాలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ నిధిని చెల్లించేవారికి ఈ ఏప్రిల్1,2022 నుంచి రెండు పీఎఫ్ ఖాతాలు విడివిడిగా నిర్వహించబడతాయి. దీనికింద ఉద్యోగపరంగా పీఎఫ్ అకౌంట్ ఉండే వారితో పాటు వాలంటరీగా పీఎఫ్ లో పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు వర్తించనుంది.

2. దీనికి అర్థం ఏమిటంటే 2022 ఆర్థిక సంవత్సరానికి ముందు పీఎఫ్ రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ చెల్లించిన మెుత్తాన్ని ఒకటే ఖాతాలో ఉంచేవారు. ఎందుకంటే ఇంతకుముందు పీఎఫ్ నిధి సొమ్ము, దానిపై వచ్చే వడ్డీ, దానిని విత్ డ్రా చేసుకోవటం పై ఎటువంటి పన్ను వర్తించేది కాదు కాబట్టి ఒక వ్యక్తికి ఒకటే ఖాతా ఉండేది.

3. కానీ.. కేంద్ర ప్రభుత్వం పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్నందున.. ఇకపై పీఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసే వారు తప్పని సరిగా రెండవ పీఎఫ్ అకౌంట్ కలిగి ఉండాల్సిందే. ఈ కొత్తగా తెరిచే రెండవ ఖాతాలోని పెట్టుబడిపై వచ్చే వడ్డీ సొమ్ము పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే ఆ వడ్డీపై పన్ను చెల్లించాల్సిందే.

4. ఎక్కువ ఆదాయం ఉండే హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల ఈ పీఎఫ్ పెట్టుబడుల ద్వారా వచ్చే వడ్డీపై పన్ను చెల్లించకుండా తప్పించుకోవడాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పీఎఫ్ పెట్టుబడిపై వచ్చే వడ్డీని కూడా బ్యాంకులో ఎఫ్ డి పెట్టుబడి నుంచి వచ్చే వడ్డీ లాగా ప్రతి ఏడాది లెక్కించి దానిపై పన్ను విధిస్తారు.

5. ఇకపై పన్ను చెల్లింపు దారులు ప్రతి సంవత్సరం రిటర్న్ ఫైల్ చేసే సమయంలో పీఎఫ్ కింద రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ మెుత్తం వెచ్చిస్తుంటే.. దానిపై వచ్చే వడ్డీపై పన్నును లెక్కించేందుకు చూపవలసి ఉంటుంది.

ఇవీ చదవండి..

Multibagger Stock: ఆరు నెలల్లో 260 శాతం పెరిగిన స్టాక్.. తాజాగా ఇన్వెస్టర్లకు బోనస్ షేర్ల ప్రకటన..

Freelancers: మీరు ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేస్తున్నారా.. దాని నుంచి మంచి సంపాదన ఆర్జిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే