Freelancers: మీరు ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేస్తున్నారా.. దాని నుంచి మంచి సంపాదన ఆర్జిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

Free Lancers: ఆదాయపన్ను చట్టం(Income Tax) కింద ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేసే వారి ఆదాయం సైతం చట్టపరంగా పన్ను విధింపబడుతుంది. టాక్స్ లెక్కించేటప్పుడు ఈ ఆదాయాన్ని ఇలా లెక్కించాలి.

Freelancers: మీరు ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేస్తున్నారా.. దాని నుంచి మంచి సంపాదన ఆర్జిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే
Freekance Job
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 28, 2022 | 9:14 AM

Freelancers: ఆదాయపన్ను చట్టం(Income Tax) కింద ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేసే వారి ఆదాయం సైతం చట్టపరంగా పన్ను విధింపబడుతుంది. టాక్స్ లెక్కించేటప్పుడు ఈ ఆదాయాన్ని వృత్తి వ్యాపారం నుంచి వచ్చే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్(Profits and gains) కింద పరిగణిస్తారు. ఇందుకోసం సదరు టాక్స్ పేయర్ ITR-3 లేదా ITR-4 కింద ఆదాయపన్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం చేస్తూ వ్యక్తి దానికి అదనంగా ఫ్రీలాన్స్ సేవలు అందించి ఏదైనా ఆదాయం గడిస్తే దానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎంటర్‌ప్రైజ్ రాబడితో పాటు, ఫ్రీలాన్స్ రాబడి ఉన్న పన్ను చెల్లింపుదారులు కూడా తమ రాబడి నుండి ఫ్రీలాన్స్ పనిని కొనసాగించడానికి అయ్యే బిల్లులను మినహాయింపుగా పొందే అవకాశం ఉంటుంది.

పన్ను చెల్లింపుదారు 12 నెలల కాలంలో తనకు వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆదాయాన్ను నిర్ణయించుకోవాలి. దానిలో నుంచి చట్టప్రకారం వివిధ సెక్షన్ల కింద వచ్చే మినహాయింపులను, బిల్లుల మెుత్తాన్ని తీసివేయాలి. చాలా మంది యజమానులు ఫ్రీలాన్సర్‌లకు చేసే చెల్లింపుల్లో ముందుగా TDSని మినహాయిస్తుంటారు. అందువల్ల పన్ను లెక్కించేటప్పుడు టీడీఎస్ ను పరిగణలోకి తీసుకోవాలి. ఫ్రీలాన్స్ ద్వారా ఆదాయం రూ.10 వేల కంటే ఎక్కువ ఉండే వారు ప్రతి త్రైమాసికంలోనూ గడువుకు ముందే.. అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు లెక్కించే పూర్తి పన్ను రూ. 10,000 కంటే ఎక్కువ అయితే.. మీరు ఆదాయపన్ను చట్టంలోని వివిధ సెక్షన్లపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి..

Low Interest Home Loan: తక్కువ వడ్డీకి హోమ్ లోన్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే..

Mahindra EV Cars: ఎలక్ట్రిక్ వాహనాలపై మహీంద్రా భారీ పెట్టుబడి.. రానున్న మూడేళ్లలో ఎన్నికోట్లు వెచ్చించనుందంటే..

Russia-Ukraine War: శాంతి చర్చలకు ఓకే అన్న రెండు దేశాలు.. కానీ అణ్వాయుధాలపై రష్యా కీలక ప్రకటన..