Petrol Diesel Price: పెట్రో ధరలపై కనిపించని యుద్ధం ఎఫెక్ట్.. భారత్‌లో స్థిరంగా పెట్రోల్, డీజిల్ స్థిరంగా..
గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. ఇలా స్థిరంగా కొనసాగుతుండటంతో వాహనదారులకు ఊరట కలిగిస్తుందనే..
గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. ఇలా స్థిరంగా కొనసాగుతుండటంతో వాహనదారులకు ఊరట కలిగిస్తుందనే చెప్పాలి. ఇక రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తత (Russia Ukraine war)ల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ (Petrol, Diesel)ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు చమురు(Crude Oil) ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధరలకు 100 డాలర్లకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లే, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలపై వ్యాట్‌ను కూడా తగ్గించాయి. తద్వారా మహానగరంలో అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయినా కూడా దేశంలోని 25 ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర రూ.100 పైనే ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.52గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.91గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 107.97గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.60 ఉండగా.. డీజిల్ ధర రూ.94.99గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.96 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.39గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.45కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.51లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.65 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.74గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.36 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.40గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.68గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.66గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.45లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.51లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.12 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.66గా ఉంది.
ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live: రణ రంగంలో కీలక మలుపు.. ఓ వైపు చర్చలు.. మరో వైపు హెచ్చరికలు..
Health Tips: అజీర్తి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 5 చిట్కాలతో చెక్ పెట్టండి..