Stock Market Update: ప్రపంచ మార్కెట్లపై పుతిన్ వార్నింగ్ ఎఫెక్ట్.. నష్టాలతో మొదలైన ముంబై బజార్ ..
సోమవారం ఉదయం ఆసియా మార్కెట్ల క్షీణత కారణంగా.. భారతీయ స్టాక్ మార్కెట్ కూడా వారం మొదటి ట్రేడింగ్ రోజు భారీ పతనంతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 529 పాయింట్లు..
ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం(Russia Ukraine War) ఐదో రోజుకు చేరుకుంది. ఈ టైమ్‌లో పుతిన్(putin plan) మరో బాంబ్ పేల్చారు. న్యూక్లియర్ ఫోర్స్‌కు పుతిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నాటో దేశాలతో ముప్పు పొంచి ఉంది.. డిఫెన్స్ చీఫ్‌లు అప్రమత్తంగా ఉండాలని పుతిన్ సూచనలు చేశారు. దీంతో అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్‌లపై(Stock Market ) కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లతోపాటు భారతీయ స్టాక్ మార్కెట్ కూడా పేడేసింది. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్ల క్షీణత కారణంగా.. భారతీయ స్టాక్ మార్కెట్ కూడా వారం మొదటి ట్రేడింగ్ రోజు భారీ పతనంతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 529 పాయింట్లు క్షీణించి 55329 వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు క్షీణించి 16,481 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే వెంటనే పతనం పెరిగి సెన్సెక్స్ 950 పాయింట్లు, నిఫ్టీ 285 పాయింట్లు పడిపోయాయి.
మార్కెట్‌లో మెటల్స్ సెక్టార్ మినహా అన్ని రంగాలు రెడ్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీ అమ్మకాలతో ట్రేడవుతున్నాయి. ఆటో, ఐటీ, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగ షేర్లు కూడా రెడ్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి.
ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ఇండెక్స్‌లోని 30 షేర్లలో 27 రెడ్ మార్క్‌లో ట్రేడవుతుండగా 3 షేర్లు గ్రీన్ మార్క్‌లో మాత్రమే ట్రేడవుతున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో అతిపెద్ద పతనం కనిపిస్తోంది, ఇది రూ. 1419 వద్ద ట్రేడవుతోంది, ఇది 2.50 శాతం క్షీణించి, పవర్ గ్రిడ్ క్లైంబింగ్ స్టాక్‌లో 0.73 శాతం పెరిగి రూ. 199 దగ్గర ట్రేడవుతోంది.
ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live: రణ రంగంలో కీలక మలుపు.. ఓ వైపు చర్చలు.. మరో వైపు హెచ్చరికలు..
Health Tips: అజీర్తి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 5 చిట్కాలతో చెక్ పెట్టండి..