Post Office: పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి లాభాలు..!

Post Office: మీరు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్టాఫీసులోని పొదుపు పథకాలలో చేయవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని పొందుతారు...

Post Office: పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి లాభాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 28, 2022 | 10:05 AM

Post Office: మీరు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్టాఫీసులోని పొదుపు పథకాలలో చేయవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని పొందుతారు. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా పూర్తిగా సురక్షితం. బ్యాంక్ డిఫాల్ట్ అయితే మీరు కేవలం రూ. 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసు (Post Office)లో మాత్రం అలా కాదు . ఇది కాకుండా, పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు . పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాల (Small Saving Schemes)లో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ( Recurring Deposit)  ఖాతా (RD) కూడా చేర్చబడింది.

వడ్డీ రేటు:

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో సంవత్సరానికి 5.8 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ వడ్డీ రేటు 1 ఏప్రిల్ 2020 నుంచే వర్తిస్తుంది. ఈ చిన్న పొదుపు పథకంలో వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన కలిపి ఉంటుంది.

పెట్టుబడి మొత్తం:

ఈ చిన్న పొదుపు పథకంలో కనీసం నెలకు రూ.100 పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసులో RD పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు.

ఎవరు ఖాతా తెరవగలరు?

ఈ పోస్టాఫీసు పథకంలో ఒక వయోజన, ముగ్గురు పెద్దలు ఉమ్మడిగా ఏర్పడి ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా పథకం కింద మైనర్ తరపున, సంరక్షకుని తరపున గార్డియన్ ఖాతాను కూడా తెరవవచ్చు. ఇది కాకుండా 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ తన సొంత పేరు మీద కూడా ఖాతాను తెరవవచ్చు. పోస్ట్ ఆఫీస్ RD పథకం ఖాతా తెరిచిన తేదీ నుండి ఐదు సంవత్సరాల (60 నెలవారీ డిపాజిట్లు) మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటుంది. ఈ స్కీమ్‌లో సంబంధిత పోస్టాఫీసుకు దరఖాస్తు చేయడం ద్వారా ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. పొడిగించిన వ్యవధిలో ఖాతా తెరిచిన వడ్డీ రేటు అదే విధంగా ఉంటుంది. అలాగే ఈ పొడిగించిన వ్యవధిలో ఎప్పుడైనా ఖాతాను మూసివేయవచ్చు. పూర్తయిన సంవత్సరాల్లో RD వడ్డీ రేటు వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Bank Holidays: మార్చి నెలలో బ్యాంకులకు 13 రోజుల సెలవులు.. ఏయే రోజు అంటే..!

ITR Verification: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 28 చివరి తేదీ..!

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం