ITR Verification: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 28 చివరి తేదీ..!

ITR Verification: 2020-21కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్‌ (ITR)ను దాఖలు చేసి ఇంకా ఈ-వెరిఫై చేసుకోని వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆదాయపు..

ITR Verification: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 28 చివరి తేదీ..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 27, 2022 | 7:56 PM

ITR Verification: 2020-21కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్‌ (ITR)ను దాఖలు చేసి ఇంకా ఈ-వెరిఫై చేసుకోని వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. సాధారణంగా ఐటీఆర్‌ రిటర్న్‌లు దాఖలు చేసిన నాలుగు నెలల్లోగా ఈ-వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వెరిఫై చేసుకోకపోతే డీఫెక్టివ్‌ రిటర్న్‌ అని అంటారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్‌ కారణంగా చాలా మంది రిటర్న్‌ల ఈ-వెరిఫై గురించి పట్టించుకోలేదు. ఈ సంవత్సరం ఐటీఆర్‌ రిటర్న్‌ లేదా, ఈ-వెరిఫికేషన్‌లో ఉన్న అన్ని ఆదాయపు పన్ను రిటర్నులను 22 ఫిబ్రవరి 2022 వరకు ధృవీకరించవచ్చని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌ 28న జారీ చేసిన సర్క్యూలర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఫిబ్రవరి 28 వరకు ధృవీరించవచ్చని తెలిపింది.

ఈ-వెరిఫై చేసుకునేందుకు ఆధార్‌ ఓటీపీ, నెట్‌ బ్యాంకింగ్‌, బ్యాంకు అకౌంట్‌, డీమ్యాట్‌ ద్వారా ఈ-వెరిఫై చేసుకునేందుకు వీలుంటుంది. లేకపోతే రిటర్ను దాఖలు చేసినప్పటికీ ఈ-వెరిఫై చేసుకోకపోతే అది చెల్లదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Bank Holidays: మార్చి నెలలో బ్యాంకులకు 13 రోజుల సెలవులు.. ఏయే రోజు అంటే..!

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల ప్రభావం సామాన్యుడిపై.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..!