Bank Holidays: మార్చి నెలలో బ్యాంకులకు 13 రోజుల సెలవులు.. ఏయే రోజు అంటే..!

Bank Holidays: ప్రతి రోజు బ్యాంకుల విషయంలో ఎన్నో పనులు ఉంటాయి. అయితే ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు..

Bank Holidays: మార్చి నెలలో బ్యాంకులకు 13 రోజుల సెలవులు.. ఏయే రోజు అంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 28, 2022 | 6:56 AM

Bank Holidays: ప్రతి రోజు బ్యాంకుల విషయంలో ఎన్నో పనులు ఉంటాయి. అయితే ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు జరిపేవారు ప్రతినెల బ్యాంకులకు ఉండే సెలవులను గమనించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఏ రోజు మూసి ఉంటాయో తెలుసుకుని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. ఇక పండగల్లో ముఖ్యమైనది హోలీ. ఆ రోజు బ్యాంకులకు సెలవు. మార్చి నెలలో (March Month) ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి (Mahashivaratri), హోలీ (Holi) ఉన్నాయి. ఈ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. మార్చి నెలలో బ్యాంకులకు 13 రోజులు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు ఇతర రాష్ట్రాలతో కలుపుకొని నిర్ణయిస్తుంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రతినెల ఆర్బీఐ బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సెలవులు ఉండకపోవచ్చు. రాష్ట్రాలను బట్టి ఉంటాయి. మరి మార్చి నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలుసుకుందాం.

మార్చి 2022లో బ్యాంకు సెలవుల జాబితా:

► మార్చి 1: మహాశివరాత్రి (దేశవ్యాప్తంగా సెలవు)

► మార్చి 3: లోసర్‌ (సిక్కింలో)

► మార్చి 4: చాప్‌ చర్‌కుట్‌ (మిజోరం)

► మార్చి 17: హోలికా దహన్‌ (కాన్పూర్‌, లక్నో, డెహ్రాడూన్‌,)

► మార్చి 18: హోలి (దేశవ్యాప్తంగా)

► మార్చి 19: హోలీ యోసాంగ్‌ 2వ రోజు (భువనేశ్వర్‌, ఇంఫాల్‌, పాట్నా)

► మార్చి 22: బీహార్‌ దివాస్‌

శని, ఆదివారాలు:

► మార్చి 6: ఆదివారం

► మార్చి 12: రెండో శనివారం

► మార్చి 13: ఆదివారం

► మార్చి 20: ఆదివారం

► మార్చి 26: నాలుగో శనివారం

► మార్చి 27: ఆదివారం

ఇవి కూడా చదవండి:

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల ప్రభావం సామాన్యుడిపై.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..!

Liquor: భారత్‌లో ఆ 10 రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా మద్యం సేవిస్తున్నారు.. ఇందులో మీ రాష్ట్రం కూడా ఉందా..? చెక్‌ చేసుకోండి