- Telugu News Photo Gallery Business photos Hero motocorp to launch its first ev in march plans a range of premium products
Hero Motocorp: ఇతర కంపెనీలకు పోటీగా హీరో మోటోకార్ప్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్
Hero Motocorp: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందకు అనుగుణంగా వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ ..
Updated on: Feb 27, 2022 | 9:48 PM

Hero Motocorp: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందకు అనుగుణంగా వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

ఇక ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 2022 మార్చిలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌ఓ నిరంజన్ గుప్తా తెలిపారు.

టూవీలర్ వాహన దిగ్గజం కూడా ప్రీమియం ఎలక్ట్రిక్ ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. టోమేకర్ తన ఎలక్ట్రిక్ వాహనాలను ఏపీలోని చిత్తూరు తయారీ కేంద్రంలో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.

హీరో మోటోకార్ప్ గత కొంత కాలంగా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హీరో మోటోకార్ప్ ప్రీమియం పోర్ట్ ఫోలియోలో మరిన్ని ఉత్పత్తులను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.





























