Russia-Ukraine War: భారతీయులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చేందుకు గంటకు ఎంత ఖర్చవుతుందో తెలుసా..

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అనేక మంది భారతీయులు, విద్యార్థులు ఆ దేశంలో చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

Russia-Ukraine War: భారతీయులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చేందుకు గంటకు ఎంత ఖర్చవుతుందో తెలుసా..
Air India
Follow us
Ayyappa Mamidi

| Edited By: Anil kumar poka

Updated on: Feb 28, 2022 | 1:50 PM

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అనేక మంది భారతీయులు, విద్యార్థులు ఆ దేశంలో చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రత్యేకంగా విమానాలను నడుపుతోంది. వీలైనంత త్వరగా భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం అనేక విమానాలను నడుపుతోంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్కో విమానం ఇక్కడి నుంచి బయలుదేరివెళ్లి తిరిగి రావడానికి ఏకంగా రూ. 1.10 కోట్లు ఖర్చవుతోందని తెలిసింది.

ఉక్రెయిన్ సరిహద్దులోని రొమేనియా, హంగరీలకు ఎయిర్ ఇండియా తన విమానాలను నడుపుతోంది. ఇందుకోసం బోయింగ్ 787 భారీ విమానాలను వినియోగిస్తోంది. ఈ విమానాలను నడిపేందుకు గంటకు రూ. 7 నుంచి 8 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. విమాన ప్రయాణ సమయం భారీగా ఉండటం వల్ల.. ఎక్కువ మంది సిబ్బందిని వినియోగించాల్సిరావటం కూడా వ్యయం పెరగటానికి కారణంగా తెలుస్తోంది. బుకారెస్ట్‌ నుంచి శనివారం ముంబయి చేరుకున్న విమానం దాదాపు ఆరు గంటలు ప్రయాణించింది. బుడాపెస్ట్‌ నుంచి దిల్లీకి వచ్చిన విమానానికి సైతం దాదాపుగా అంతే సమయం పట్టింది. ఈ సుదీర్ఘ ప్రయాణం కోసం గంటకు రూ.7-8 లక్షల చొప్పున మొత్తంగా ప్రయాణానికి రూ.1.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా. డ్రీమ్‌లైనర్‌ నడవడానికి గంటకు 5 టన్నుల ఇంధనం అవసరమవుతుంది. ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చును భారత ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Kim Jong-Un: తగ్గేదే లే.. యుద్ధం జరుగుతుండంగా కిమ్ మామ ఏం చేశాడంటే..

Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రం మరో ముందడుగు.. ప్రత్యేక ట్విట్టర్‌ అకౌంట్‌.