Kim Jong-Un: తగ్గేదే లే.. యుద్ధం జరుగుతుండంగా కిమ్ మామ ఏం చేశాడంటే..
Kim Jong-Un: మరో సారి ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ తనదైన దూకుడును ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంపై చర్చించుకుంటున్న సమయంలో.. క్షిపణి ప్రయోగం ఆందోళన కలిగిస్తోంది.
Kim Jong-Un: మరో సారి ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ తనదైన దూకుడును ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంపై చర్చించుకుంటున్న సమయంలో.. క్షిపణి ప్రయోగం(Missile test) చేసి ఉద్రిక్తతలను పెంచింది. కిమ్ ప్రయోగించినది ఒక బాలిస్టిక్ మిసైల్ అని దక్షిణ కొరియా, జపాన్ సైనిక అధికారులు ప్రకటించారు. జపాన్ సముద్రజలాల్లోకి దీనిని ప్రయోగించినట్లు వారు వెల్లడించారు. గత కొంత కాలంగా దూకుడు మరింతగా పెంచిన ఉత్తర కొరియా.. కొత్త తరం ఆయుధాలను పరీక్షిస్తూ ముందుకు వెళుతోంది. దీని వెనుక అమెరికాను టార్గెట్ చేయటమే ప్రధాన కారణమని ఆ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. కిమ్ దూకుటు వల్ల తమ దేశ భద్రతకు ముంపు పొంచి ఉందని జపాన్ దేశం అభ్యంతరం వ్యక్తం చేసింది.
అమెరికా తమ దేశంపై అక్కసుతో ఉన్నందునే తాము అణు క్షిపణుల పరీక్షలను మరింత ముమ్మరం చేసినట్లు నార్త్ కొరియా వెల్లడించింది. కేవలం ఒక్క నెల కాలంలోనే ఏడు సార్లు క్షిపణి ప్రయోగాలను నిర్వహించిన కిమ్.. చైనా వింటర్ ఒలంపిక్స్ కారణంగా కొంత కాలం వాటిని నిలిపివేసింది. కానీ.. ఇటీవల అవి ముగియడంతో కిమ్ మళ్లీ తన దూకుడు పెంచారు. అందువల్లనే తాజాగా మరోసారి బాలిస్టిక్ మిసైళ్ల పరీక్షలను ఆ దేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిపై దక్షిణ కొరియాతో పాటు వివిధ దేశాలు దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఇవీ చదవండి..
Gold: బంగారం కొంటున్నారా.. అయితే ఇలా చేయండి.. ఎలాంటి నష్టం ఉండదు..
Banking News: ఆ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా పెంపు..