Banking News: ఆ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా పెంపు..

Banking News: బ్యాంక్ ఆఫ్ బరోడా తన వివిధ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ల వడ్డీ రేట్లను(FD Interest rates) పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 25, 2022 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

Banking News: ఆ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా పెంపు..
Interest Rate Hike
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 27, 2022 | 8:27 AM

Banking News: బ్యాంక్ ఆఫ్ బరోడా తన వివిధ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ల వడ్డీ రేట్లను(FD Interest rates) పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 25, 2022 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు అందిస్తున్న వడ్డీ రేట్ల విషయంలో 10 బేసిక్(10 Basis points) పాయింట్లను పెంచి బ్యాంక్ డిపాజిట్ దారులకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఒక సంవత్సర కాల వ్యవధి ఉన్న సాధారణ ఎఫ్ డిల పై ఇంతకు ముందు ఉన్న 4.90 శాతం వడ్డీ రేటుకు బదులు 5 శాతం చెల్లించనుంది. ఇదే సమయంలో ఒకటి నుంచి రెండు సంవత్సరామ మధ్య కాలానికి చేసిన ఎఫ్ డి పెట్టుబడులపై వడ్డీని ఇంతకుముందు ఉన్న 5 శాతం నుంచి ప్రస్తుతం 5.10 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది.

బ్యాంకు పత్రికా ప్రకటన ప్రకారం:

కరోనా తీసుకువచ్చిన ప్రస్తుత సవాలు పరిస్థితిలో.. రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్ డీ చేసిన రెసిడెంట్ సీనియర్ సిటిజన్‌కు అదనపు వడ్డీ రేటును చెల్లించాలని బ్యాంక్ నిర్ణయించింది.

1. 5 సంవత్సరాల వరకు అన్ని టెన్యూర్స్ డిపాజిట్లపై 0.50%.

2. 5 నుంచి 10 సంవత్సరాల వరకు కాలవ్యవధి టెన్యూర్స్ డిపాజిట్లపై 1.00% 31.03.2022 వరకు చెల్లుబాటు అవుతాయి

3. సీనియర్ సిటిజన్ ప్రిఫరెన్షియల్ రేట్ కేవలం “రెసిడెంట్ ఇండియన్ సీనియర్ సిటిజన్”కి మాత్రమే వర్తిస్తుంది.”

ఫిక్స్‌డ్ డిపాజిట్ మెుత్తం రూ. 15.01 లక్షల నుంచి రూ. 2 కోట్ల ఉన్న వాటిపై వడ్డీ రేటును బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. సాధారణ ప్రజలకు ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన తరువాత 5.05 వడ్డీ రేటును అందిస్తోంది. ఇది గతంలో 4.95 శాతంగా ఉంది. ఏడాది నుంచి రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును బ్యాంక్ 5.05 శాతం నుంచి 5.15 శాతానికి పెంచింది.

ఎన్‌ఆర్‌ఈ రూపాయి డిపాజిట్లపై (రూ. 2 కోట్ల వరకు) వడ్డీ రేట్లను కూడా 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ నిల్వలున్న సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేట్లను సైతం పెంచుతున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు ముందు పంజాబ్ నేష్నల్ బ్యాంక్, అంతకు ముందు దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్, ఐడీబీఐతో పాటు మరిన్ని బ్యాంకులు ఎఫ్ డి డిపాజిట్లపై తమ వడ్డీ రేట్లను తాజాగా పెంచాయి.

ఇవీ చదవండి..

Challan Payment: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్.. చెల్లింపులకు ఆన్ లైన్ పోర్టల్

Reliance: అమెజాన్ చేతికి ఫ్యూచర్ రీటైల్ స్టోర్లు.. మరింతగా దిగజారిన ఆర్థిక పరిస్థితి..!

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం