Reliance: అమెజాన్ చేతికి ఫ్యూచర్ రీటైల్ స్టోర్లు.. మరింతగా దిగజారిన ఆర్థిక పరిస్థితి..!
Reliance: రిలయన్స్ కారణంగా లీజు చెల్లింపులు చేయడంలో విఫలమైన ఫ్యూచర్ రిటైల్(Future retail) కనీసం 200 స్టోర్ల నిర్వహణను రిటైలర్ రిలయన్స్ తీసుకుంటున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
Reliance: రిలయన్స్ కారణంగా లీజు చెల్లింపులు చేయడంలో విఫలమైన ఫ్యూచర్ రిటైల్(Future retail) కనీసం 200 స్టోర్ల నిర్వహణను రిటైలర్ రిలయన్స్ తీసుకుంటున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. 2020 నుంచి రిలయన్స్ ఫ్యూచర్ సంస్థకు చెందిన రిటైల్ ఆస్తులను పొందేందుకు 3.4 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ముగించడంలో విఫలమైంది. ఇప్పటికే దీనిపై లీగల్ గా పోరాడుతున్న భాగస్వామి Amazon.com Inc కొన్ని ఒప్పందాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ న్యాయపరంగా నిరోధించింది. దీనిపై ఫ్యూచర్, రిలయన్స్, అమెజాన్ సంస్థల నుంచి ఎటువంటి స్పందన లేదు. చట్టపరమైన పోరాటం కారణంగా రిటైల్ ఆస్తుల విక్రయం నిరోధించబడినందున రిలయన్స్.. ఫ్యూచర్ దుకాణాలను స్వాధీనం చేసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని తెలుస్తోంది. అమెజాన్‌తో వివాదాన్ని ఉటంకిస్తూ.. మిస్ అయిన బ్యాంకు చెల్లింపులపై దివాలా చర్యలను ఎదుర్కోవడాన్ని నివారించడానికి జనవరిలో ఫ్యూచర్ తన రుణదాతలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
ఫ్యూచర్ – ప్రముఖ బిగ్ బజార్ 1,700 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. దాని కొన్ని అవుట్‌లెట్‌లకు లీజు చెల్లింపులు చేయలేకపోయింది. ఫలితంగా రిలయన్స్ కొన్ని దుకాణాల లీజులను తన పేరుకు బదిలీ చేసింది.. స్టోర్లను నిర్వహించడానికి వాటిని ఫ్యూచర్‌కు సబ్‌లెట్ చేసిందని వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ చెల్లింపులు చేయడంలో విఫలమైనందున, రిలయన్స్ దాదాపు 200 అవుట్‌లెట్‌లను ప్రారంభించి, రీబ్రాండ్ చేయాలని నిర్ణయించుకుంది, లేకపోతే మూసివేయబడతాయని తెలుస్తోంది.
200కి పైగా స్టోర్‌లు రిలయన్స్ స్టోర్‌లకు మారుతాయని సమాచారం ప్రకారం తెలుస్తోంది. రాయిటర్స్ సంస్థ చూసిన ఒక లేఖలో.. రిలయన్స్ ఈ స్టోర్‌లలో ఫ్యూచర్ ఉద్యోగులకు అదే నిబంధనలపై కొత్త ఉద్యోగాలను ఇచ్చింది. “మా సంస్థలో చేరడానికి మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము” అని అందులో పొందుపరచి ఉంది. ఫ్యూచర్ సంస్థలో అమెరికా దిగ్గజం 2019లో 200 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ఆ సమయంలో చేసుకున్న ఒప్పందాన్ని ఫ్యూచర్ ఉల్లంఘించిందని అమెజాన్ వాదించింది. ఈ వ్యవహారంలో చట్టపరమైన మద్ధతు అమెజాన్ సంస్థకు ఉంది.
ఇవీ చదవండి..
Russia Ukraine War: చెచెన్‌లను రంగంలోకి దింపిన రష్యా.. ఉక్రెయిన్‌కు సహాయంగా జర్మనీ, ఫ్రాన్స్
Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో