Russia Ukraine Crisis: వార్ ఎఫెక్ట్.. అక్కడ డబుల్ సెంచరీ కొట్టిన పెట్రోల్..
Petrol and diesel prices: ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక (Srilanka) నెత్తిన మరో పిడుగు పడింది. పొట్ట నింపుకోవడానికి పడరాని పాట్లు పడుతున్న లంకేయులకు చమురు, నిత్యావసర ధరలు షాక్ ఇస్తున్నాయి.
Petrol and diesel prices: ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక (Srilanka) నెత్తిన మరో పిడుగు పడింది. పొట్ట నింపుకోవడానికి పడరాని పాట్లు పడుతున్న లంకేయులకు చమురు, నిత్యావసర ధరలు షాక్ ఇస్తున్నాయి. విదేశాల నుంచి చమురు కొనుగోళ్లకు డబ్బులు లేవంటూ గతవారం అక్కడి ప్రభుత్వం చేతులెత్తేయడం అక్కడి దీన పరిస్థితికి అద్దం పడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల (Petrol and diesel prices)ను భారీగా పెంచుతూ చమురుసంస్థలు తీసుకున్న నిర్ణయం అక్కడి ప్రజలను మరిన్ని ఇబ్బందుల్లో పడేసింది. శ్రీలంకలో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 200 రూపాయలు దాటింది. ఒక్కరోజులో పెట్రోల్‌పై లీటర్‌కు 20 రూపాయలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 204కు చేరింది. అంతేకాదు, అక్కడ డీజిల్‌పై కూడా లీటర్‌కు 15 రూపాయలు పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ తెలిపింది. దీంతో డీజిల్ ధర 139కి చేరింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణమని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. కాగా ఈ ధరలు శ్రీలంక కరెన్సీలోనే ఉన్నాయని, భారత రూపాయితో పోలిస్తే శ్రీలంక రూపి విలువ 2.69 పైసలు ఉందని చెబుతున్నారు నిపుణులు. అంతర్జాతీయ స్థాయిలో చముర ధరలను పరిశీలిస్తున్నామని, భారత్‌పై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కాగా గతంలోనే శ్రీలంక ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. గత నెలలో ద్రవ్యోల్బణం ఏకంగా 25 శాతం పెరిగింది. దీంతో చమురు ధరలతో పాటు ఇతర నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన శ్రీలంకకు కరోనా వల్ల గట్టి దెబ్బ తగిలింది. మహమ్మారి దెబ్బకు పర్యాటక రంగం కుదేలయ్యింది. విదేశీ మారక విలువలు పూర్తిగా అయిపోయాయి. దీంతో దేశానికి రవాణా అయిన చమురును కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితిని ఎదుర్కొంది శ్రీలంక. అటు శ్రీలంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. ఆహార పదార్థాలు, ఔషధాల దిగుమతి కోసం భారత్‌ను 1 బిలియన్ డాలర్ల రుణ సాయం కోరనున్నారు శ్రీలంక ఆర్థిక మంత్రి.
Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..
Telangana: అంతా ఒరిజినల్ అన్నారు.. ఢోకా లేనే లేదన్నారు.. చివరకు వారు చేసి పని ఇది..!