Challan Payment: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్.. చెల్లింపులకు ఆన్ లైన్ పోర్టల్

Challan Payment: మార్చి నెల ప్రారంభం నుంచి చివరి వరకుతెలంగాణ వ్యాప్తంగా రాయితీలతో పెండింగ్‌ చలానాల ‘ఈ-లోక్‌ అదాలత్‌’ నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. దీనివల్ల మార్చి నెల 1- 31 మధ్య కాలంలో ఎటువంటి నిరీక్షణ లేకుండా చెల్లించేందుకు అవకాశం..

Challan Payment: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్.. చెల్లింపులకు ఆన్ లైన్ పోర్టల్
E Challan Payment
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 27, 2022 | 7:41 AM

Challan Payment: మార్చి నెల ప్రారంభం నుంచి చివరి వరకు తెలంగాణ వ్యాప్తంగా రాయితీలతో(Discount) పెండింగ్‌ చలానాల(Pending Challans) ‘ఈ-లోక్‌ అదాలత్‌’ నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. దీనివల్ల మార్చి నెల 1- 31 మధ్య కాలంలో ఎటువంటి నిరీక్షణ లేకుండా.. ఈ-చలానాల వెబ్‌సైట్‌(https://echallan.tspolice.gov.in/publicview) లోనే వాహనదారులు తమ పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా పోర్టల్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. గడిచిన నాలుగేళ్లలో నమోదైన 6.19 కోట్ల ట్రాఫిక్‌ ఉల్లంఘనల కేసులకు గాను.. వాహనదారులకు రూ. 2,300 కోట్ల జరిమానాలు విధించటం జరిగింది. అయితే.. ఇప్పటి వరకు ఈ మెుత్తం జరిమానాల్లో కేవలం సగం మాత్రమే జరిమానాలు వసూలయ్యాయి. మిగిలిన జరిమానాల వసూలు కోసం పోలీసు శాఖ ప్రత్యేకంగా రాయితీలను ప్రకటించింది. ద్విచక్ర వాహనదారులు చెలానా మెుత్తంలో 75 శాతం రాయితీతో ఈ-లోక్‌అదాలత్‌లో చెల్లింపులు చేయవచ్చు. ఉదాహరణకు.. ఒక వాహనంపై రూ. 1,000 చలానా పెండింగ్‌లో ఉంటే.. పోలీసు శాఖ ఇచ్చిన రాయితీ పోగా కేవలం రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. ఈ పెండింగ్ చెలానా చెల్లింపు సొమ్ముకు సర్వీస్‌ఛార్జ్‌ రూ. 35 అదనంగా వసూలు చేస్తారు.

అదేవిధంగా.. పెండింగ్ చెలానాల విషయంలో కార్లకు 50 శాతం, బస్సులకు 30 శాతం రాయితీ ఇవ్వాలని సూచనలు చేస్తూ అధికారులు డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించారు. ఇన్‌ఛార్జి డీజీపీ వాటికి ఆమోదముద్ర వేయడమే తరువాయి. ఈ-లోక్‌అదాలత్‌కు అనుగుణంగా అధికారులు ఈ-చలాన్‌ పోర్టల్‌లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పోర్టల్‌లో వాహనం నంబరును నమోదు చేయగానే.. ఉల్లంఘన చలానా మొత్తం కనిపించేది. కానీ.. ఇప్పుడు రాయితీతో కూడిన చెల్లింపులకు వీలుగా వెబ్ సైట్ ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీంతో మార్చి నెల ప్రారంభం నుంచి వాహనదారులు సులువుగా తమ పెండింగ్ చెలానాలను క్లియర్ చేసుకోవచ్చని తెలుస్తోంది. పోర్టల్ అప్ డేషన్ పనులు జరుగుతున్నందున తాత్కాలికంగా ఈ సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవు. త్వరలోనే పోర్టల్ తిరిగి అందుబాటులోకి రానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి ఉన్నందున మాస్క్‌ నిబంధనల ఉల్లంఘనులకు విపత్తు నిర్వహణ చట్టం కింద తెలంగాణ వ్యాప్తంగా.. మాస్కులు ధరించని వారిపై రూ. 1,000 అధికారులు జరిమానాలు విధించారు. వీటికి సంబంధించి 2020 మార్చి నుంచి 13 లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా.. వాటి నుంచి ప్రభుత్వానికి రూ. 135 కోట్ల సొమ్ము రావలసి ఉంది. ఈ పెండింగ్ మెుత్తాన్ని వసూలు చేసేందుకు సైతం ఈ-లోక్‌ అదాలత్‌ ద్వారా చెల్లింపులకు అవకాశం కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కానీ.. దీనికి సంబంధించి పూర్తి నిబంధనలు ఇంకా నిర్ణయం కాలేదు. త్వరలోనే అధికారులు దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పెండింగ్ ఫైన్ లు వసూలు సులభతరం అవటమే కాకుండా.. మాస్క్ వేసుకోకుండా జరిమానా పడినవారికి వేగంగా ఫైన్ చెల్లించేందుకు వెసులుబాటు కలగనుంది.

ఇవీ చదవండి..

Reliance: అమెజాన్ చేతికి ఫ్యూచర్ రీటైల్ స్టోర్లు.. మరింతగా దిగజారిన ఆర్థిక పరిస్థితి..!

Russia Ukraine Crisis: క్షేమంగా బయటపడ్డ భారతీయ విద్యార్థులు.. ఢిల్లీ చేరిన రెండో విమానం!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!