Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రం మరో ముందడుగు.. ప్రత్యేక ట్విట్టర్‌ అకౌంట్‌.

Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా (Russia) చేస్తున్న యుద్ధంతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి సద్వేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే..

Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రం మరో ముందడుగు.. ప్రత్యేక ట్విట్టర్‌ అకౌంట్‌.
Operation Ganga
Follow us

|

Updated on: Feb 28, 2022 | 1:25 AM

Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా (Russia) చేస్తున్న యుద్ధంతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి సద్వేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా ఎయిర్‌ ఇండియా విమానాల్లో (Air India) ఉక్రెయిన్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను భారత్‌కు క్షేమంగా తీసుకొస్తున్నారు. ఆపరేషన్‌ గంగా పేరుతో భారత విదేశాంగ శాఖ ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది.

ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారి కోసం కేంద్రం తాజాగా ప్రత్యేక ట్విట్టర్‌ ఖాతాను తెరిచింది. ఇందులో ఉక్రెయిన్‌కు సరిహద్దులుగా ఉన్న దేశాల వివరాలతో పాటు హెల్ప్‌ లైన్‌ నెంబర్లను అందుబాటులోకి ఉంచింది. ఆపరేషన్‌ గంగా పేరుతో ఈ ట్విట్టర్‌ ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చే క్రమంలో ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను ఈ ట్విట్టర్‌ ఖాతాలో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సేవలు 24 గంటల్లో అందుబాటులో ఉండనున్నాయి.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌పై జరుగుతోన్న యుద్ధం నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ప్రధాని నేతృత్వంలో ఉన్నత సాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా భారతీయుల భద్రత, తరలింపునకు సంబంధించి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారని అధికారులు తెలిపారు. భారతీయుల తరలింపునకు ఉక్రెయిన్‌ పొరుగు దేశాల సహకారం తీసుకుంటామని ప్రధాని తెలిపారని సమాచారం.

Also Read: ఉక్రెయిన్‌-రష్యా దాడులు భారత్‌పై ఎఫెక్ట్‌.. వీటి ధరలు మరింత ప్రియం

Viral Video: తగ్గేదేలే అంటున్న ఐటీ మినిస్టర్.. కర్రసాముతో అదరగొట్టేశారు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!

భారతదేశంలో హోలీని ప్రత్యేకంగా జరుపుకునే ప్రదేశాలు