Mahindra EV Cars: ఎలక్ట్రిక్ వాహనాలపై మహీంద్రా భారీ పెట్టుబడి.. రానున్న మూడేళ్లలో ఎన్నికోట్లు వెచ్చించనుందంటే..
Mahindra EV Cars: దేశీయ కార్ల దిగ్గజం మహీంద్రా & మహీంద్రా (M&M) రానున్న మూడు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇన్నర్ కంబషన్ ఇంజిన్ అభివృద్ధికి వీటిని వినియోగించనుంది సంస్థ.
Mahindra EV Cars: దేశీయ కార్ల దిగ్గజం మహీంద్రా & మహీంద్రా (M&M) రానున్న మూడు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం కనీసం రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇన్నర్ కంబషన్ ఇంజిన్ (ICE) ఆటోమొబైల్స్‌పై ఎక్కవ వ్యయం చేయనున్నట్లు తెలుస్తోంది.దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ఎక్కువ మోడళ్లతో పెద్ద పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో మహీంద్రా అండ్ మహీంద్రా తన మొదటి EV SUV, XUV 400ని తదుపరి అర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. M&M ఇటీవలే దాని ‘బోర్న్ ఎలక్ట్రికల్ ఇమాజినేటివ్ అండ్ ప్రిసైయెంట్’ క్రింద మూడు ఐడియా EV SUVలను ప్రదర్శించే టీజర్ వీడియోను ప్రారంభించింది. ఇది ఈ సంవత్సరం జూలైలో అందరి ముందుకు రానుంది.
రానున్న మూడేళ్లలో EVలపై మూలధన వ్యయంగా రూ.3,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు వెచ్చించాలని M&M ప్లాన్ చేస్తోంది. EVలు, ICE ఆటోమొబైల్స్‌పై 50:50 రేషియోలో ఉండవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. దీనిపై సంస్థను సంప్రధించినప్పటికీ ఇప్పటి వరకూ ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. 2010లో మళ్లీ స్వదేశీ EV తయారీ సంస్థ Revaలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడంతో EVల విషయానికి వస్తే మహీంద్రా దేశీయ దిగ్గజ వాహన తయారీదార్లలో ఒకటని చెప్పుకోవాలి. అయినప్పటికీ.. ఇది eVerito తయారీని మూసివేసింది. ఎందుకంటే.. ఇది EVల కోసం సరికొత్త రోడ్‌మ్యాప్‌తో ముందుకు వెళుతోంది.
మహీంద్రా యొక్క ‘బోర్న్ ఎలక్ట్రికల్ ఇమాజినేటివ్, ప్రెసియెంట్’ అత్యంత దూకుడుగా ఉన్న భారతీయ ఆటో మార్కెట్‌లో M&Mకు భారీ వృద్ధిని అందించనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే తన ఫేవరెట్ స్కార్పియో కార్ మోడల్ లోనూ సరికొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ ను విడుదల చేయవచ్చని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉండనున్నందున ఇప్పటికే టాటా, ఎమ్ జీ మోటార్స్, హుండాయ్ తో పాటు మరిన్ని కంపెనీలు తమ ఈవీలను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇవీ చదవండి..
Russia-Ukraine War: శాంతి చర్చలకు ఓకే అన్న రెండు దేశాలు.. కానీ అణ్వాయుధాలపై రష్యా కీలక ప్రకటన..
Russia-Ukraine War: భారతీయులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చేందుకు గంటకు ఎంత ఖర్చవుతుందో తెలుసా..