Interest Rates: కొత్తగా జనవరి తరువాత బ్యాంక్ లోన్ తీసుకున్నారా.. అయితే ఈ వివరాలు మీకోసమే..

Interest Rates: దేశంలోని జాతీయ బ్యాంకులు జనవరి 2022 నుంచి తమ వడ్డీ రేట్లను సవరించాయి. దీనివల్ల తాజాగా లోన్ తీసుకోవాలనుకునేవారికి ఇకపై రుణాలు మరింత ప్రియం కానున్నాయి.

Interest Rates: కొత్తగా జనవరి తరువాత బ్యాంక్ లోన్ తీసుకున్నారా.. అయితే ఈ వివరాలు మీకోసమే..
Canara bank fd rates
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 01, 2022 | 6:39 AM

Interest Rates: దేశంలోని జాతీయ బ్యాంకులు జనవరి 2022 నుంచి తమ వడ్డీ రేట్లను సవరించాయి. దీనివల్ల తాజాగా లోన్ తీసుకోవాలనుకునేవారికి ఇకపై రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇంతకు ముందు యావరేజ్ వడ్డీ రేటు 7.72 శాతం ఉండగా.. వడ్డీ రేటు 10 బేసిక్ పాయింట్లు పెరగటంతో అది 7.82 శాతానికి పెరిగనుందని భారతీయ రిజర్వు బ్యాంక్ ఇచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. క్రెడిట్‌లో పెరుగుదల, బ్యాంకులు డిపాజిట్ రేట్లను పెంచడం ప్రారంభించిన నేపథ్యంలో తాజాగా రుణాలపై వడ్డీ రేట్లలో ఈ పెరుగుదల వచ్చింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) సగటు WALR డిసెంబర్ 2021లో 7.16 శాతం నుంచి 2022 జనవరిలో 7.23 శాతానికి, ప్రైవేట్ బ్యాంకులు 12 బేసిస్ పాయింట్లు డిసెంబర్ 2021లో 8.62 శాతం నుంచి జనవరి 2022లో 8.74 శాతానికి పెంచాయి. విదేశీ బ్యాంకులు 11 బేసిస్ పాయింట్లు డిసెంబర్ 2021లో 6.03 శాతం నుంచి 2022 జనవరిలో 6.14 శాతానికి పెంచాయి. బ్యాంకులు మంజూరు చేసిన రుణాలపై సగటు వడ్డీ రేటు డిసెంబర్ 2021లో 8.86 శాతం నుంచి 8.83 శాతానికి సగటున 3 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. బ్యాంకులు బకాయి ఉన్న టర్మ్ డిపాజిట్లపై వెయిటెడ్ యావరేజ్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్ రేట్లు (WADTR) డిసెంబర్ 2021లో 5.04 శాతం నుంచి జనవరి 2022లో 5.03 శాతానికి తగ్గాయి.

ఇవీ చదవండి..

వేములవాడలో శివరాత్రి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయ పరిసరాలు

Gold Silver Price: పసిడి ప్రియులకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

BIRAC Recruitment: పరిశోధన రంగంలో ఫెలోషిప్‌లకు ఆహ్వానం… యూజీ నుంచి పీహెచ్‌డీ వరకు అవకాశం..