AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kim Jong Un: కష్టాల్లో నార్త్ కొరియా.. కిమ్ ఇలాకాలో అరడజన్ అరటిపండ్లు రూ. 3 వేలు!

Kim Jong Un: ఒక టీ ప్యాకెట్ ధర రూ. 5 వేలు, కాఫీ ప్యాకెట్ రూ. 7 వేలు, ఏడు అరటి పండ్లు రూ. 3 వేలు.. ఏంటీ ఈ ధరలు.! ఎవరైనా కొనుగోలు చేయగలరా..

Kim Jong Un: కష్టాల్లో నార్త్ కొరియా.. కిమ్ ఇలాకాలో అరడజన్ అరటిపండ్లు రూ. 3 వేలు!
Kim Jong-un
Ravi Kiran
|

Updated on: Jun 19, 2021 | 9:02 AM

Share

ఒక టీ ప్యాకెట్ ధర రూ. 5 వేలు, కాఫీ ప్యాకెట్ రూ. 7 వేలు, ఏడు అరటి పండ్లు రూ. 3 వేలు.. ఏంటీ ఈ ధరలు.! ఎవరైనా కొనుగోలు చేయగలరా అని అనుకుంటున్నారా.? ఇవన్నీ కూడా కిమ్ ఇలాకాలో తాజా ధరలు. ప్రస్తుతం నార్త్ కొరియా ఆహార సంక్షోభంలో ఉంది. అక్కడ ఒక్కసారిగా నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి.

సరిహద్దుల్లో ఆంక్షలు, వరదల కారణంగా ఏర్పడిన పంట నష్టం వల్ల నార్త్ కొరియాలో ఊహించని విధంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తమ దేశం ఆహార కొరతను ఎదుర్కుంటోందని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ విషయాలకు బలం చేకూరుస్తున్నాయి.

దేశం ఆహార కొరతను ఎడుర్కుంటోందని.. వెంటనే ఆహారోత్పత్తి పెంచేందుకు మార్గాలు అన్వేషించాలని తాజాగా జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కిమ్ అధికారులను ఆదేశించాడు. ఇక ఇంత సంక్షోభంలో ఉన్నా కూడా.. కోవిడ్ ఆంక్షలను మాత్రం మరికొన్ని రోజులు పొడిగించాలని కిమ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కిమ్ తాజాగా తీసుకొచ్చిన కొత్త చట్టాలు..

కిమ్ ఇటీవలే కొన్ని నూతన చట్టాలను అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటి ప్రకారం.. ఆ దేశంలోని ప్రజలెవ్వరూ కూడా జుట్టుకు రంగు వేయకూడదు. అంతేకాకుండా కిమ్ సూచించిన 215 హెయిర్ కట్స్‌కు మాత్రమే ఫాలో కావాలి. మిగతా దేశాలకు సంబంధించిన స్టైల్స్‌, వస్త్రాధారణను పౌరులు అస్సలు అనుసరించకూడదు. చిరిగిపోయిన జీన్స్, టీ షర్ట్స్‌లను యువత వేసుకోకూడదని.. అలాగే ముక్కు, పెదాలపై రింగులు ఉండకూడదని కిమ్ ఆదేశించారు. అటు సౌత్ కొరియా సినిమాలు, సంగీతం, వీడియోలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తే కఠిన శిక్షకు అర్హులు.

Also Read:

కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?

పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!

Follow Us
నేను సఫర్ కావడం చూసి నా కూతురు ఎఫెక్ట్ అయ్యింది..
నేను సఫర్ కావడం చూసి నా కూతురు ఎఫెక్ట్ అయ్యింది..
ఇందిరమ్మ బీమా పథకంపై ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్.. వీరికి మాత్రమే
ఇందిరమ్మ బీమా పథకంపై ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్.. వీరికి మాత్రమే
రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!
రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!
51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..
51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే
Optical Illusion: ఈ అరటి కాయల మధ్యలో ఉన్న పామును చూశారా ??
Optical Illusion: ఈ అరటి కాయల మధ్యలో ఉన్న పామును చూశారా ??
ఇంట్లో శాలిగ్రామాన్ని ఎలా ఉంచుకోవాలి? పూజా నియమాలు, దిశ, మహిళలు..
ఇంట్లో శాలిగ్రామాన్ని ఎలా ఉంచుకోవాలి? పూజా నియమాలు, దిశ, మహిళలు..