Church: వామ్మో ఏంటీ ఈ దారుణం.. చర్చి పాస్టర్ మాటలు విని 200 మందికి పైగా మృతి
కెన్యాలోని ఓ చర్చి పాస్టర్ మాటలు నమ్మి ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందడం కలకలం రేపుతోంది. గత నెల రోజు నుంచి అధికారులు కెన్యాలోని ఓ అటవి ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం రోజున ఏకంగా 22 మృతదేహలు దొరికాయి. అయితే వీరంతా ఆహారం తీసుకోకుండా చనిపోయిన్లు అధికారులు నిర్ధారించారు.

కెన్యాలోని ఓ చర్చి పాస్టర్ మాటలు నమ్మి ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందడం కలకలం రేపుతోంది. గత నెల రోజు నుంచి అధికారులు కెన్యాలోని ఓ అటవి ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం రోజున ఏకంగా 22 మృతదేహలు దొరికాయి. అయితే వీరంతా ఆహారం తీసుకోకుండా చనిపోయిన్లు అధికారులు నిర్ధారించారు. మరో 600 మంది జాడ తెలియడం లేదు. వివరాల్లోకి వెళ్తే మెకంజీ అనే చర్చి పాస్టర్ ఈ అటవి ప్రాంతంలోని కిలిఫి అనే చోట 800 ఎకరాల్లో మకాం వేశాడు. ఆహరం లేకుండా తీవ్రమైన ఆకలితో మరణిస్తే జీసెస్‌ను కలిసే అదృష్టం వస్తుందని అక్కడి ప్రాంత వాసులని నమ్మించాడు. దీంతో అతడ్ని నమ్మిన అనుచరులు నిరాహార దీక్షలు చేయడం ప్రారంభించారు. రోజులు గడుస్తున్న కొద్ది ఆహారం తినకపోవడంతో డజన్ల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లందరిని కూడా ఆ ప్రాంతంలోనే సామూహిక ఖననాలు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కెన్యా అధికారులు దాడులు చేసి గత నెల మెకంజీని అదుపులోకి తీసుకొన్నారు.
ఆ ప్రాంతం నుంచి దాదాపుగా 100కుపైగా మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షలు నిర్వహించగా… చాలా మంది ఆహారం తినక, గొంతు నులమడం, ఆయుధాలతో దాడి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అలాగే కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీంతో మెకంజీ భార్యతో పాటు 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు 610 మంది ఆచూకి లేకుండా పోయిందని కోస్ట్ రీజియన్ కమిషనర్ రోడ వెల్లడించారు. అంతేకాదు.. అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను కూడా విడిపించారు. ప్రస్తుతం వీరంతా కనీసం నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే మెకంజీ ఉండే చర్చిలో చిన్నారులు మృతి చెందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు అడవిలోకి మకాం మార్చాడు. అతడి అనుచరులు కూడా అడవిలోకి వెళుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు. ఎట్టకేలకు మళ్లీ అతడ్ని అరెస్టు చేశారు. అయితే కెన్యాలో మతపరమైన ఆచారాలను బలంగా పాటించే అలావాటుంది. దేశంలోని వేరేచోట్ల ఇటువంటి వాటికి ఆచరిస్తున్నారేమో గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు ఆ దేశాధ్యక్షుడు విలియం రూటో.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..