తొలిసారి హైదరాబాద్ బిర్యానీ తిన్న జపాన్ అంబాసిడర్.. రియాక్షన్ చూశారా?
హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరూ బిర్యానీ తినకుండా ఇక్కడి నుంచి వెళ్లరంటే అతిశయోక్తి కాదు. తాజాగా భారత్ పర్యటనలో ఉన్న పాన్ రాయబారి ఒనో కెయిచి తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ దమ్ బిర్యానీ రుచి చూశారు..

హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరూ బిర్యానీ తినకుండా ఇక్కడి నుంచి వెళ్లరంటే అతిశయోక్తి కాదు. తాజాగా భారత్ పర్యటనలో ఉన్న పాన్ రాయబారి ఒనో కెయిచి తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ దమ్ బిర్యానీ రుచి చూశారు. అంతే మన బిర్యానికి ఫిదా అయిపోయారు. దాని రుచిని తెగ పొగిడేస్తూ సోషల్ మీడియలో పోస్టు పెట్టారు. హైదరాబాద్ బిర్యానీ రుచికి తాను ఆశ్చర్యపోయానని అందులో తెలిపారు. ‘తెలంగాణ పర్యటన సందర్భంగా అసలైన హైదరాబాదీ బిర్యానీని ఆస్వాదించాను! దాని గొప్ప సుగంధ ద్రవ్యాలు, అద్భుత రుచికి ఆశ్చర్యపోయాను. ఈ బిర్యానికి బానిసైపోయాను’ అని అంబాసిడర్ తన ఎక్స్ ఖాతా పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల జపాన్ రాయబారి ఒనో కెయిచి జపాన్-ఆంధ్రప్రదేశ్ సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు. CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2025ను విజయవంతంగా నిర్వహించినందుకు సీఎం చంద్రబాబును ఓనో అభినందించారు.
‘CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2025 విజయవంతంగా నిర్వహించినందుకు సీఎం చంద్రబాబుకు అభినందనలు. జపాన్-AP పారిశ్రామిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఈ సమావేశం జరిగింది. కీలక రంగాలలో ఆంధ్రప్రదేశ్ పెరుగుతున్న సామర్థ్యాన్ని అన్వేషించడం గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు’ ఎక్స్‌లో మరో పోస్టులో తెలిపారు.
Enjoyed authentic Hyderabadi biryani during visit to Telangana! Amazed by its rich spices and bold flavors — “truly addictive!”😄 pic.twitter.com/Qdtd8cOQSU
— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) November 16, 2025
EVలు, బ్యాటరీ తయారీకి బలమైన సరఫరా-గొలుసు పర్యావరణ వ్యవస్థను నిర్మించడం నుంచి ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, షిప్ బిల్డింగ్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) లో కొత్త అవకాశాల వరకు కీలక రంగాలలో పెరుగుతున్న సామర్థ్యాన్ని అన్వేషించడానికి జపాన్ రాయబారి HE ఒనో కెయిచిని కలవడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. జపాన్ ఫార్మా రాజధాని కోయామా నుంచి ప్రేరణ పొందుతూ ఫార్మాస్యూటికల్ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. వైజాగ్‌లో జరిగిన CII భాగస్వామ్య సదస్సులో 20 జపనీస్ కంపెనీలు మాతో చేరడం, ఆంధ్రప్రదేశ్ పట్ల బలమైన ఆసక్తిని వ్యక్తం చేయడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జపాన్ ఖచ్చితత్వం, పరిపూర్ణత సంస్కృతి నిజంగా ప్రశంసనీయం. ఈ విశ్వసనీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మేము ఎదురుచూస్తున్నామని తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




