హజ్ యాత్రలో ఘోర విషాదం.. అర్థరాత్రి 42 మంది సజీవదహనం.. అంతా హైదరాబాద్ వారే..!
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించినట్లు సమాచారం.. మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు.. డీజిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి.. దీంతో భారీగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.. అందులో ఉన్న 42 మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించినట్లు సమాచారం.. మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు.. డీజిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి.. దీంతో భారీగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.. అందులో ఉన్న 42 మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో చాలా మంది భారతీయులు ఉన్నారని.. వారిలో హైదరాబాద్ కు చెందిన వారే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం బదర్ – మదీనా మధ్య ముఫ్రిహాత్ ప్రాంతంలో జరిగింది. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
హజ్ యాత్రలో భాగంగా మక్కాలో తమ ఆచారాలను ముగించుకున్న యాత్రికులు మదీనాకు వెళుతుండగా.. బస్సు, డిజీల్ ట్యాంకర్ ఢీకొన్నాయి.. ఈ ఘటన జరిగినప్పుడు చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారని సమాచారం. స్థానిక వర్గాలు 42 మంది మరణించినట్లు నివేదించినప్పటికీ, అధికారులు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.
సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి..
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సంబంధించి సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు. తెలంగాణ కు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైన సహాయ చర్యలకు రంగంలోకి దిగాలని అదేశించారు. సీఎం అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీ లో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు. అంతేకాకుండా సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. +91 79979 59754, +91 99129 19545 ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
ఒక ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి వీళ్లంతా దుబాయ్ వెళ్లినట్లు సమాచారం.. ఈ ట్రావెల్స్ నుండి 16 మంది వెళ్లినట్లు తెలుస్తోంది. మరికొంత మంది మరో ట్రావెల్స్ ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మక్కా నుంచి మదీనాకు వెళ్లే ఈ ఉమ్రా యాత్రకు వెళ్లిన వారి వివరాలపై మరికాసేపట్లో పూర్తి స్పష్టత రానుంది.
