AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాను వణికిస్తున్న సరికొత్త వైరస్‌.. ట్రంపాలజీతో షేకవుతోన్న వాషింగ్టన్..!

అమెరికాలో H5 N5 వైరస్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. వాషింగ్టన్‌ను సరికొత్త వైరస్‌ వణుకు పుట్టిస్తోంది. జంతువులకు మాత్రమే సోకే ఈ వైరస్‌, ఫస్ట్‌ టైమ్‌ మనుషుల్లో కన్పించడం హడలెత్తిస్తోంది. ట్రంపాలజీతో షేకవుతోన్న అమెరికాకు మరో షాకింగ్‌ న్యూస్‌. అగ్రరాజాన్ని మళ్లీ వైరస్‌ వర్రీ వేధిస్తోంది. బర్డ్‌ ఫ్లూ లాంటి వైరస్‌ బెంబేలెత్తిస్తోంది. వాషింగ్టన్‌లో ఓ వ్యక్తికి H5 N5 అనే సరికొత్త వైరస్‌ సోకినట్టు గుర్తించారు వైద్యులు.

అమెరికాను వణికిస్తున్న సరికొత్త వైరస్‌.. ట్రంపాలజీతో షేకవుతోన్న వాషింగ్టన్..!
Us H5n5 Bird Flu
Balaraju Goud
|

Updated on: Nov 17, 2025 | 7:41 AM

Share

అమెరికాలో H5 N5 వైరస్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. వాషింగ్టన్‌ను సరికొత్త వైరస్‌ వణుకు పుట్టిస్తోంది. జంతువులకు మాత్రమే సోకే ఈ వైరస్‌, ఫస్ట్‌ టైమ్‌ మనుషుల్లో కన్పించడం హడలెత్తిస్తోంది. ట్రంపాలజీతో షేకవుతోన్న అమెరికాకు మరో షాకింగ్‌ న్యూస్‌. అగ్రరాజాన్ని మళ్లీ వైరస్‌ వర్రీ వేధిస్తోంది. బర్డ్‌ ఫ్లూ లాంటి వైరస్‌ బెంబేలెత్తిస్తోంది. వాషింగ్టన్‌లో ఓ వ్యక్తికి H5 N5 అనే సరికొత్త వైరస్‌ సోకినట్టు గుర్తించారు వైద్యులు. ఈ వైరస్‌ సాధారణంగా జంతువులకు మాత్రమే సోకుతుందన్నారు మనుషులకు సోకడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ అంటున్నారు డాక్టర్లు. H5 N5 వైరస్‌ ప్రభావం చలికాలంలో ఎక్కువగా వుంటుందన్నారు.

ఒక జంతువు నుంచి మరో జంతువుకు ఈ వైరస్‌ సోకే హిస్టరీ ఉంది. కానీ ఇప్పుడు H5 N5 వైరస్‌ మనుషుల్లో కన్పించడం డాక్టర్లకు సవాల్‌గా మారింది. సదరు వ్యక్తికి కోళ్ల ద్వారనే ఈ వైరస్‌ సోకి వుంటుందని భావిస్తున్నారు. అతనికి ఇతరాత్ర హెల్త్‌ కంప్లైంట్స్‌ కూడా ఉన్నాయన్నారు. గత ఏడాదిగా అమెరికాలో బర్ద్‌ ఫ్లూ కేసులు నమోదు కాలేదు, కానీ బర్డ్‌ ఫ్లూ రిలేటేడైన H5 N5 వైరస్‌ ఉనికి కన్పించడం ఆందోళన కలిగిస్తోంది. జంతువుల్లో పరిపాటిగా కన్పించే ఈ వైరస్‌ ఇప్పుడు మనుషుల్లో వేగంగా వ్యాపిస్తుందా? నివారణకు మార్గాలేంటి? వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందా? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

H5 N5 వైరస్‌ మనుషులపై ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు డాక్టర్లు. అలాగని ఈ వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని సూచిస్తున్నారు. చాలా రోజుల తరువాత బర్డ్‌ ఫ్లూ సంబంధిత వైరస్‌ ఉనికి కన్పించింది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కోడి మాంసాన్ని టచ్‌ చేయకపోవడమే మంచిదన్నారు. ముఖ్యంగా పౌల్టీ రంగంలో ఉన్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..