AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Largest Spider Web: అద్భుతం.. ప్రపంచంలోనే అతి పెద్ద సాలెగూడు..

World Largest Spider Web: అద్భుతం.. ప్రపంచంలోనే అతి పెద్ద సాలెగూడు..

Phani CH
|

Updated on: Nov 17, 2025 | 12:59 PM

Share

గ్రీస్-అల్బేనియా సరిహద్దులోని ఓ గంధకపు గుహలో ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు కనుగొనబడింది. 1,11,000 సాలీళ్లకు నివాసంగా ఉన్న ఈ 1,140 చ.అ. గూడులో సాధారణంగా ఒంటరిగా జీవించే రెండు జాతుల సాలీళ్లు సహజీవనం చేస్తున్నాయి. గుహలోని ప్రత్యేక ఆహారం, చీకటి కారణంగా వాటి డీఎన్ఏ, జీర్ణవ్యవస్థ విభిన్నంగా మారాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అసాధారణ ఆవిష్కరణ జీవవైవిధ్యాన్ని తెలియజేస్తుంది.

ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉంటాయి. తాజాగా గ్రీస్, అల్బేనియా సరిహద్దులోని ఓ గంధకపు గుహలో ప్రపంచంలోనే అతిపెద్దదైన సాలీడు గూడును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుమారు 1,11,000 సాలీళ్లకు నివాసంగా ఉన్న ఈ గుహను చూసి వారు అబ్బురపడ్డారు. ఈ అసాధారణ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను ‘సబ్‌టెర్రేనియన్ బయాలజీ’ అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ భారీ సాలీడు గూడు ‘సల్ఫర్ కేవ్’గా పిలిచే ఓ గుహలో, పూర్తి చీకటి ఉండే ప్రాంతంలో ఉంది. గుహ గోడపై ఇది ఏకంగా 1,140 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. వేలాది గరాటు ఆకారపు చిన్న చిన్న గూళ్లను ఒకదానికొకటి కలుపుతూ సాలీళ్లు ఈ భారీ కాలనీని నిర్మించుకున్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ గూడును తొలిసారిగా 2022లో చెక్ స్పీలియోలాజికల్ సొసైటీకి చెందిన గుహల అన్వేషకులు గుర్తించగా, 2024లో శాస్త్రవేత్తల బృందం దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరిపింది. ఈ గూటిలో ‘టెజెనారియా డొమెస్టికా’, ‘ప్రినెరిగోన్ వాగాన్స్’ అనే రెండు జాతుల సాలీళ్లు కలిసి జీవిస్తున్నాయి. సాధారణంగా ఈ జాతులు ఒంటరిగా జీవిస్తాయని, ఇలా కలిసి ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో రెండు వేర్వేరు జాతులు ఒకే గూటిలో సహజీవనం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గుహలోని పూర్తి చీకటి కారణంగా వాటి చూపు మందగించి, ఒకదానిపై ఒకటి దాడి చేసుకోకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఈ గుహలోని గంధకపు నీటి ప్రవాహం కారణంగా పెరిగే సూక్ష్మజీవులను తినే చిన్న కీటకాలు ఈ సాలీళ్లకు ప్రధాన ఆహారం. ఈ ప్రత్యేక ఆహారం వల్ల గుహలోని సాలీళ్ల జీర్ణవ్యవస్థ, జన్యు నిర్మాణం కూడా బయట నివసించే వాటి కంటే భిన్నంగా ఉన్నట్లు డీఎన్ఏ పరీక్షల్లో తేలింది. రెండు దేశాల సరిహద్దులో ఉన్న ఈ అద్భుతమైన సాలీళ్ల కాలనీని కాపాడుకోవడం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Stonefishes: సముద్రపు అడుగున జీవించే అరుదైన చేప.. దీని సొగసు చూడతరమా

ఆ నాలుగు కారణాల వల్లే 99శాతం మందిలో గుండెపోటు

సరదాలకు శనివారం .. ఫ్యామిలీకి ఆదివారం .. మారిన ట్రెండ్‌

నడకతో మతిమరుపు దూరం..! మరి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి ??

Viral Video: ఇదేందిది.. ఇంటిపైన కొబ్బరిచెట్టా..! ఇలా కూడా పెంచుతారా !!