AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడకతో మతిమరుపు దూరం..! మరి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి ??

నడకతో మతిమరుపు దూరం..! మరి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి ??

Phani CH
|

Updated on: Nov 17, 2025 | 12:11 PM

Share

నడక ఆరోగ్యానికి మంచిదని, జ్ఞాపకశక్తిని పెంచుతుందని వైద్యులు చెబుతారు. ఇది అల్జీమర్స్‌ను నివారించగలదని అధ్యయనాలు వెల్లడించాయి. ప్రతిరోజూ 5,000 అడుగులు వేయడం ద్వారా అల్జీమర్స్‌ను మూడేళ్లు, 7,500 అడుగులతో ఏడేళ్లపాటు వాయిదా వేయవచ్చని నిపుణులు గుర్తించారు. జీవనశైలి మార్పులతో జ్ఞాపకశక్తి క్షీణతను అధిగమించవచ్చు. మెదడు ఆరోగ్యం కోసం నడక తప్పనిసరి.

నడక ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతారు. అందుకే ప్రతి ఒక్కరూ సులభమైన ఈ వ్యాయామం ద్వారా అనేక రోగాలకు చెక్‌ పెట్టవచ్చని, ప్రతి ఒక్కరూ వాకింగ్‌ చేయాలని సూచిస్తారు. ఈ నడక జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మతిమరుపు అనేది సహజం. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనిబారిన పడుతున్నారు. వయసు రిత్యా కలిగే ఈ జ్ఞాపకశక్తి క్షీణతను నడకద్వారా అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. రోజుకు 5,000 అడుగులు వేయడం ద్వారా మూడేళ్లపాటు ఈ అల్జీమర్స్‌ను వాయిదా వేయవచ్చని ఒక అధ్యయనంలో తేలింది. దైనందిన నడకలో భాగంగా రోజుకు 7,500 అడుగులు వేసే వ్యక్తులు జ్ఞాపకశక్తి క్షీణతను ఏడేళ్లపాటు వాయిదా వేసుకున్నట్టేనని ఈ అధ్యయనంలో వెల్లడించింది. దాదాపు 300 మందిపై అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలు ఇలా నిర్థారణకు వచ్చారు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా జీవించేవారి మెదళ్లలో హానికారకమైన ‘టావు’ అనే ప్రొటీన్‌ పేరుకుపోతుందని, ఈ ప్రొటీన్‌ న్యూరాన్‌లను నాశనం చేసి అల్జీమర్స్‌ వ్యాధికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మనిషి జ్ఞాపకశక్తి క్షీణింపచేసే అల్జీమర్స్‌ అంకురార్పణకు వారి జీవనశైలికి సంబంధించిన అంశాలే ప్రధాన కారణమని తెలిపారు. ప్రారంభదశలోనే జీవనశైలిలో మార్పులు చేసుకుంటే అల్జీమర్స్‌ వ్యాధి లక్షణాలను నిలువరించవచ్చని అధ్యయనకారులు పేర్కొన్నారు. అల్జీమర్స్‌ అనేది వయసు పెరిగేకొద్దీ పెరిగే మేధో సంబంధ వ్యాధి. ఈ వ్యాధి సంక్రమించిన వ్యక్తుల జ్ఞాపకశక్తి, సంభాషణా సామర్థ్యం, ఆలోచనా శక్తి క్రమంగా క్షీణించిపోయి కాలక్రమంలో దైనందిన కార్యకలాపాలు కూడా కష్టసాధ్యమవుతాయి. తాజా అధ్యయనంలో భాగంగా 50 నుంచి 90 ఏళ్ల మధ్య వయసు కలిగిన 296 మందిపై అధ్యయనం జరిపారు. ‘‘హార్వర్డ్‌ ఏజింగ్‌ బ్రెయిన్‌’’ స్టడీ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులందరూ ప్రారంభ దశలో మేధో క్షీణతతో బాధపడుతున్నవారే. ఈ వ్యక్తులందరికీ పొజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ (PET) ద్వారా బ్రెయిన్‌ స్కాన్‌ చేసి వారి మెదళ్లలో పేరుకుపోయిన ప్రొటీన్‌ మోతాదును లెక్కించారు. శారీరక శ్రమ ఎక్కువగా చేసిన వారి మెదళ్లలో అమైలాయిడ్‌ సంబంధ టావు ప్రొటీన్‌ తక్కువగా ఏర్పడి ఉన్నట్టు గుర్తించారు. అంటే అలాంటివారిలో మేధో క్షీణత తక్కువగా ఉంటుందని, వారిలో టావు ప్రోటీన్‌లు పోగుపడటం తక్కువగా ఉందని అధ్యయన బృందం వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ఇదేందిది.. ఇంటిపైన కొబ్బరిచెట్టా..! ఇలా కూడా పెంచుతారా !!

వీడు మనిషి కాదు.. మహానుభావుడు బాస్.. అలా ఎలా పట్టేసాడు