వీడు మనిషి కాదు.. మహానుభావుడు బాస్.. అలా ఎలా పట్టేసాడు
ఐదు విషనాగులతో ఓ యువకుడు సాహసోపేతమైన విన్యాసాలు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. బుసలు కొడుతున్న పాములను చాకచక్యంగా తప్పించుకుంటూ, వాటిని నియంత్రిస్తున్న యువకుడి ధైర్యానికి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ప్రాణాలకు తెగించి ఆడుతున్న ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో లక్షల మందిని ఆకట్టుకుంది. అతన్ని నాగరాజు అని కొందరు ప్రశంసించారు.
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. కానీ కొందరు పాములు తమ మిత్రులన్నట్టు వాటితో ఆడుకుంటారు. అలాంటి ఓ వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ ఐదు పెద్ద నాగుపాములు పడగవిప్పి బుసలు కొడుతూ ఉన్నాయి. ఆ పాములముందు ఓ యువకుడు రకరాల విన్యాసాలు చేస్తున్నాడు. ఆ పాములు అతన్ని కాటువేయాలని ప్రయత్నించాయి. అయితే అతను ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటూ వాటిని నియంత్రిస్తున్నాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు అతని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోలో ఐదు విషపూరిత నాగుపాములు వాటి పడగలతో బుసలు కొడుతూ కనిపించాయి. గాజులు ధరించిన ఒక వ్యక్తి వాటి ముందు హాయిగా కూర్చున్నాడు. అతను తన చేతులు, కాళ్ళను కదిలిస్తూ, పాములను తనపై దాడి చేయమని ఆహ్వానిస్తూ రెచ్చగొట్టాడు. అప్పుడప్పుడు, అతను వాటికి దగ్గరగా వస్తున్నాడు, అవి అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. అతను తన చేతిని వెనక్కి తీసుకొని తనను తాను కాపాడుకున్నాడు. అతని చురుకుదనం, ధైర్యం చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇలా ఒకేసారి ఇన్ని పాములను ఎదుర్కొంటూ అంత ప్రశాంతంగా ఉండటం మామూలు విషయం కాదు. ఇలాంటి ఘటనలు రేర్‌గా జరుగుతాయి. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనిని దాదాపు లక్షన్నరమందికి పైగా వీక్షించారు. వేలాది మంది ఈ వీడియోను లైక్ చేసి కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆ వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు “అతను మనిషి కాదు, నాగరాజు” అని వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ishan Kishan: ఇషాన్ కిషన్ మాతోనే ఫుల్ క్లారిటీ ఇచ్చిన వీడియో
ఎట్టకేలకు ఈ మొండిపిల్ల.. కెప్టెన్ అయ్యెనప్పా
Kaantha: ఏం చేస్తాం..!కొన్ని సార్లు తప్పులు జరుగుతాయి.. కాంతా రివ్యూ
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

