Kaantha: ఏం చేస్తాం..!కొన్ని సార్లు తప్పులు జరుగుతాయి.. కాంతా రివ్యూ
"కాంత" దుల్కర్ సల్మాన్ నటించిన 1950ల నాటి పీరియడ్ డ్రామా. గురు-శిష్యుల ఈగో పోరు ప్రధానాంశం. దుల్కర్ నటన అద్భుతంగా ఉన్నా, కథనం నీరసంగా సాగి సహనానికి పరీక్ష పెడుతుంది. ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్ కాగా, బలహీనమైన కథ, ఊహాజనిత మలుపులు మైనస్. ఇది దుల్కర్ కెరీర్‌లో ఒక అరుదైన తప్పుగా నిలిచిపోతుంది.
మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాల తర్వాత దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి మార్కెట్ వచ్చింది. దానికి తోడు రెట్రో కథలకు ఈయన పెట్టింది పేరు. ఇలాంటి సమయంలో 1950స్ నేపథ్యంలో వచ్చిన సినిమా కాంత. పైగా రానా దగ్గుపాటి ప్రొడ్యూసర్. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడీ రివ్యూలో చూద్దాం! కాంతా కథలోకి వెళితే.. అయ్య అలియాస్ సముద్రఖని ఓ పెద్ద సినిమా డైరెక్టర్. అనాథ అయిన TK మహదేవన్ అలియాస్ దుల్కర్ సల్మాన్‌ని చేరదీసి హీరోని చేస్తాడు. ఆ తర్వాత వాళ్ల జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు విడిపోతారు. ఆ తర్వాత మహదేవన్ పెద్ద స్టార్ అవుతాడు. తాను పరిచయం చేసిన వాడు తనకంటే ఎక్కువ ఎదిగిపోయాడని.. తనకు మర్యాద ఇవ్వడం లేదంటూ ఈగో పెంచుకుంటాడు అయ్య. అదే సమయంలో తాను తన గురువుకు విధేయతతో ఉన్నా కూడా తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని దూరం పెడతాడు మహదేవన్. ఇద్దరి ఇగో కారణంగా శాంతా అనే సినిమా మొదలుపెట్టి ఆపేస్తారు. చాలా సంవత్సరాల తర్వాత కుమారి అలియాస్ భాగ్యశ్రీ బోర్సే అనే కొత్త హీరోయిన్ ఎంట్రీతో గతంలో మొదులు పెట్టిన శాంత సినిమానే కాంతాగా టైటిల్ మార్చి మళ్లీ మొదలు పెడతారు. కానీ ఇది అయ్యకు నచ్చినట్టు కాకుండా తనకు నచ్చినట్టు చేయాలి అనుకుంటాడు మహదేవన్. ఈ క్రమంలోని నాటకీయ పరిణామాలు ఏర్పడతాయి.. మరి శాంతా సినిమా కాంతాలా మారిందా..? అసలు పూర్తయిందా లేదా..? ఈ మధ్యలో ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.. రెట్రో కథలకు దుల్కర్ సల్మాన్ కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. ఆయన సినిమాలో ఉన్నాడు అంటే కచ్చితంగా పీరియడ్ కథ ఉండాల్సిందే. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలు దుల్కర్ సల్మాన్ కు అలా కలిసొచ్చాయి కూడా. కానీ అన్నిసార్లు మనం పర్ఫెక్ట్ అని కాదు.. కొన్నిసార్లు తెలియకుండానే తప్పులు జరుగుతుంటాయి. దుల్కర్ సల్మాన్ కు అలా జరిగిందే కాంతా. ఆయన నుంచి వచ్చిన రేర్ మిస్టేక్ ఇది.. ఇందులోనూ పెర్ఫార్మెన్స్ పరంగా ఢోకా లేదు.. కానీ కథలోనే విషయం లేదు. చాలా నీరసంగా సాగే కథనం సహనానికి పరీక్ష.. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ మహానటి మళ్ళీ చూస్తున్నట్టే ఉంటుంది. దుల్కర్, భాగ్యశ్రీ సీన్స్ అన్నీ.. జెమిని గణేషన్, సావిత్రి సీన్స్ గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నా.. సెకండాఫ్ కూడా అంతంత మాత్రమే. అప్పటి వరకు ఉన్న డ్రామా కాస్తా.. రానా రాగానే థ్రిల్లర్ కు షిఫ్ట్ అవుతుంది. ఒకేచోట జరగడం మూలానో ఏమో గానీ కథ కూడా అక్కడక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. గురు శిష్యుల ఇగో మీద నడిచే కథ ఇది.. కానీ దాని మీద ఎక్కువ సన్నివేశాలు రాసుకోలేదు దర్శకుడు సెల్వమణి. వాళ్లిద్దరి మధ్య దూరం పెరగడానికి సరైన రీజన్ ఇవ్వలేదు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో కొన్ని మలుపులు ఉన్నా కూడా అంతగా ఆసక్తికరంగా అనిపించవు. మర్డర్ మిస్టరీ వైపు వెళ్లిన కథను ఈజీగానే గెస్ చేయొచ్చు. క్లైమాక్స్ మాత్రం బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ కారణంగా క్లైమాక్స్ బాగా హైలైట్ అయింది. అక్కడక్కడ కొన్ని మలుపులు.. వింటేజ్ లుక్ తప్పిస్తే కాంతా సినిమాలో చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేకపోవడమే మైనస్. ఇక TK మహదేవన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు.. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో నటన అద్భుతం. భాగ్యశ్రీ బోర్సే కూడా బాగా నటించింది. రానా దగ్గుబాటి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ గా ఉంది. సముద్రఖని నటన ఆకట్టుకుంది. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు సినిమాటోగ్రాఫర్. రానా ప్రొడ్యూసర్ కాబట్టి.. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉండేలా చూసుకున్నాడు. ఇక దర్శకుడిగా సెల్వమణి సెల్వరాజ్ పాయింట్ బాగా రాసుకున్నాడు కానీ దాన్ని ఇంకాస్త గ్రిప్పింగ్ గా చెప్పి ఉంటే బాంగుండేది. అండ్ సినిమా మొత్తానికి మేజర్ ప్లస్ ఏంటంనేది చెప్పాలంటే.. ఆర్ట్ డిపార్ట్మెంట్. ఆ నాటి లోకంలోకి మనల్ని వెళ్లగలిగాం అంటే.. అది ఈ డిపార్ట్మెంట్ వల్లే. ఇక ఓవరల్ ఆల్‌గా కాంతా గురించి చెప్పాలంటే.. డైరెక్టర్ ఇంకాస్త ఫోకస్ చేసుంటే కాంతా.. ఇకాస్త మెరుగ్గా ఉండేదేమో..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్‌కే కుచ్చు టోపీ పెట్టారుగా
180 కి.మీ స్పీడ్‌లో ‘వందేభారత్’ .. తొణకని గ్లాసులో నీరు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

