180 కి.మీ స్పీడ్‌లో ‘వందేభారత్’ .. తొణకని గ్లాసులో నీరు
నగరాలను కలిపే వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్స్ విజయవంతమయ్యాయి. 180 కి.మీ వేగంతో దూసుకుపోతున్నప్పుడు, గ్లాసుల్లో నీరు చిందకపోవడం, గ్లాసులు పడకపోవడంద్వారా రైలు అసాధారణ స్థిరత్వాన్ని వాటర్ టెస్ట్ నిరూపించింది. ఈ వీడియో వైరల్ కాగా, భారత రైల్వే పనితీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. స్లీపర్ ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దేశంలో నగరాలను కలుపుతూ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. త్వరలో స్లీపర్ క్లాస్ వందేభారత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ రెడీ అవుతోంది. ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రోహల్ఖుర్ద్-ఇంద్రఘర్-కోట సెక్షన్‌లో ట్రయల్ రన్ నిర్వహించారు. రైలు స్థిరత్వం, బ్రేకింగ్, ప్రయాణ అనుభవాన్ని పరీక్షించేందుకు లోడ్‌తో పాటు ఖాళీగానూ టెస్టింగ్ నిర్వహించారు. రైలు గంటకు 180 కిలోమీటర్ల టాప్‌స్పీడ్ అందుకుంది. అప్పుడు ‘వాటర్ టెస్ట్’ కూడా చేసారు. రైలు మాక్సిమమ్ స్పీడ్‌తో వెళుతున్నప్పుడు మూడు గాజు గ్లాసులతో నీటిని ఉంచారు. మూడు గాజు గ్లాసులలో నీరు ఏ మాత్రం తొణకలేదు. మూడు గ్లాసులను ఒకదానిపై ఒకటి ఉంచినప్పుడు కూడా గ్లాసులు కిందపడలేదు. ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇండియన్ రైల్వే పనితీరు పై నెటిజన్లు ప్రశంసించారు. వందేభారత్ స్లీపర్ రైలులో ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కామెంట్లు పెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Karnataka Farmers: చెరుకు రైతుల అసహనం.. రోడ్డుపై బీభత్సం
రష్మికకు పబ్లిక్‌లోనే ముద్దుపెట్టేసిన రౌడీ హీరో
కిలో ఉల్లి ఒక్క రూపాయి మాత్రమే.. ఎక్కడంటే
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

