భారీ శబ్ధంతో కూలిన బ్రిడ్జి.. ఎక్కడంటే..
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో టిబెట్‌ను కలిపే హాంగ్ కీ బ్రిడ్జి ప్రారంభమైన కొద్ది రోజులకే కుప్పకూలింది. 758 మీటర్ల పొడవైన ఈ వంతెన కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రమాద సమయంలో వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చైనా ఇంజినీరింగ్ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చైనాలో ఇంజినీరింగ్ వైఫల్యం బయటపడింది. చైనాను టిబెట్‌తో కలిపేలా ఇటీవలే ప్రారంభించిన హాంగ్ కీ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. చైనా సియాచిన్ ప్రావిన్స్ లో నిర్మించిన ఈ బ్రిడ్జి 758 మీటర్ల పొడవైంది. వంతెన కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సియాచిన్ ప్రావిన్స్ లో టిబెట్ తో చైనాను కలుపుతూ నిర్మించిన హాంగ్ కీ బ్రిడ్జ్‌ను కొద్దిరోజుల కిందటే ప్రారంభించారు. కాగా మంగళవారం ఉదయం సమయంలో బ్రిడ్జ్ ప్రారంభంలోని భాగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపైనుంచి వాహనాలు ఏమి వెళ్లకపోవడం, అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే వంతెన కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. వంతెన కూలిన సమయంలో భారీగా శిథిలాలు నదిలో పడిపోయి పెద్ద ఎత్తున వ్యర్థాలు పైకి లేచాయి. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. పారిశ్రామిక రంగం లో తామెప్పుడూ ముందుంటాం అని చెప్పుకునే డ్రాగన్ దేశంలో ఇంత పెద్ద వంతెన నిర్మించిన కొద్ది రోజుల్లోనే కూలిపోవడం ఏంటని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
టీమిండియా అండర్-19 జట్టులో హైదరాబాదీకి ఛాన్స్
రూటు మార్చిన చైన్ స్నాచర్లు.. డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

