అయ్యో.. ఆమె ఏం పాపం చేసిందిరా.. అలా చంపేశారు
పశ్చిమగోదావరి ముద్దాపురం నాగహరిత అనుమానాస్పద మృతి కేసులో సంచలనం. మొదట షార్ట్ సర్క్యూట్‌గా భావించినా, ఫోరెన్సిక్ నివేదిక హత్యను ధృవీకరించింది. తలపై బలమైన గాయాలు, పెట్రోల్‌తో తగలబెట్టినట్లు వెల్లడైంది. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పదంగా మారిన ఈ కేసులో తదుపరి విచారణ కీలకం.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామానికి చెందిన బిటెక్ విద్యార్థిని ముళ్లపూడి నాగహరిత అనుమానాస్పద రీతిలో చనిపోయింది. గదిలో నిద్రిస్తున్న ఆమె షార్ట్ సర్క్యూట్ కారణంగా సజీవదహనమైనట్లు ఆమె తండ్రి చెప్పటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2022 నవంబర్ 12న జరిగింది. అయితే యువతి మేనమామ, అమ్మమ్మలు మాత్రం ఇది కేవలం హత్య అంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు. తాజాగా యువతి మృతి కేసులో ఫోరెన్సిక్ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోరెన్సిక్ నివేదికలో యువతి తల పగిలినట్లు వచ్చింది. దీంతో ఆమె మరణానికి ముందు తలపై బలంగా కొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన తరువాత పెట్రోలు పోసి హత్య చేసినట్లుగా నివేదిక రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని తాజాగా విచారణ చేపట్టారు. ఆస్తి తగాదాలు నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో కుటుంబ సభ్యుల నుంచి కాకుండా గ్రామ వీఆర్వో నుంచి ఫిర్యాదు తీసుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు సరైన విచారణ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట నుంచి మృతురాలి మేనమామ, అమ్మమ్మ, నాగ హరితను హత్య చేశారని ఆరోపిస్తున్న క్రమంలో ఇప్పుడు పోలీసులు ఏ విధంగా కేసు ముగిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా హరిత తల్లితండ్రులు వసంత, ముళ్ళపూడి శ్రీను. శ్రీను వ్యవసాయం చేస్తుంటారు. వసంత చనిపోవటంతో శ్రీను తరువాత రూపను రెండో పెళ్లి చేసుకున్నాడు. హరిత ఒక ప్రయివేట్ కాలేజ్‌లో బిటెక్ చదువుతూ ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె అమ్మమ్మ, మేనమామ కృష్ణయ్య పాలెంలో ఉంటారు. అయితే మారుతల్లి రూప రాజకీయాల్లోనూ ఉండటంతో అప్పట్లో ఈ ఘటన కలకలం రేపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న పోలీసుల విచారణలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జూపార్క్‌లో దారుణం.. దుప్పులను చంపేసిన కుక్కలు
కళ్యాణకట్టలో ఉద్యోగాలంటూ బురిడీ కొట్టించిన లేడీ కిలాడీ
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

