రూటు మార్చిన చైన్ స్నాచర్లు.. డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగులు రూట్ మార్చారు. ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి, ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. అడ్డుకోబోయిన కూతురిని సైతం తోసేసి పరారయ్యారు. సంఘటనపై స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి లోపల చోరీలు పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వారి ఆగడాలు శృతిమించి పోతున్నాయి..ఇప్పటి వరకు బైక్ పై వచ్చి రోడ్డు పై వెళ్తున్న మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు ఎతుకెళ్లే వారినే చూశాం. ఇప్పుడు చైన్ స్నాచర్లు రూట్ మార్చారు. డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళి మహిళల మెడలో నుండి బంగారం చైన్‌లు ఎత్తుకెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పట్టపగలు చైన్ స్నాచింగ్ చోరీ ఉదంతం కలకలం రేపుతుంది. జోగిపేట పట్టణంలోని సత్యసాయి కాలనిలో వృద్ధురాలు మెడలో నుండి నాలుగు తులాల బంగారం పుస్తెల తాడును లాక్కెళ్లారు దుండగులు. ఇంట్లో ఉన్న శంకరంపేట మణెమ్మ అనే వృద్ధురాలీ కండ్లలో కారం కొట్టి దొంగలించారు. గమనించిన కూతురు వెంకట లక్ష్మీ అడ్డుకునే ప్రయత్నం చేసినా దుండగుడు ఆమెను తోసేసి బైక్ పై పరార్ అయ్యారు. వృద్ధురాలు శంకరమ్మ గత కొన్ని రోజులుగా కూతురు దగ్గర ఉంటుంది. కూతురు వెంకటలక్మి దుండగులను వెంబడించినా ఫలితం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేసింది.స్థానికుల పిర్యాదుతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న జోగిపేట సిఐ అనిల్ కుమార్ ఎస్సై పాండు చుట్టు పక్కల గాలించినా దుండగుల జాడ లభించలేదు. బాధితురాలి నుండి పిర్యాదు తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. ఆమె ఏం పాపం చేసిందిరా.. అలా చంపేశారు
జూపార్క్‌లో దారుణం.. దుప్పులను చంపేసిన కుక్కలు
కళ్యాణకట్టలో ఉద్యోగాలంటూ బురిడీ కొట్టించిన లేడీ కిలాడీ
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

