కిలో ఉల్లి ఒక్క రూపాయి మాత్రమే.. ఎక్కడంటే
ఉల్లి, టమాటా ధరల అస్థిరత రైతులను నష్టాల్లోకి నెట్టివేస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఉల్లి కిలో రూ.1కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాత స్టాక్, అధిక ఉత్పత్తి, ఎగుమతి ఆంక్షలు ధరల పతనానికి కారణం. రిటైల్‌లో రూ.15 ఉన్నా, దళారులే లాభపడుతున్నారు. రైతులకు న్యాయం, వినియోగదారులకు స్థిరమైన ధరలు అందాలంటే ప్రభుత్వ జోక్యం అవశ్యం.
మన దేశంలో ప్రతీ సంవత్సరం.. ఉల్లి, టమాటా ధరలు చూస్తే.. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి లాగే ఉంటుంది. ఒక్కోసారి కిలో టమాట, ఉల్లి.. ఏకంగా 200 రూపాయలు పలికిన ఉదంతాలు ఉన్నాయి. మరికొన్నిసార్లు కిలో రూపాయికి పడిపోయిన సంఘటనలు అనేకం. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు .. రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కిలో రూ.1 పలకడంతో.. ఏం చేయాలో తోచక అన్నదాతలు లబోదిబోమంటున్నారు. భారీ ధరలు ఉన్నాయని.. రైతులు ఉల్లి, టమాట పంటను పండిస్తే.. తీరా పంట చేతికి వచ్చేసరికి రేటు పతనం అవుతుంది. భారీగా పెట్టుబడి పెట్టి పండించిన పంటకు కనీసం పెట్టిన ఖర్చులు కూడా రాక రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే పాత ఉల్లి స్టాక్ ఉండటం , రైతులు ఈ ఏడాది అధిక పంటను పండించడం, ఇతర దేశాలకు ఉల్లి పంటను ఎగుమతి చేయకుండా.. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై విధించిన ఆంక్షలు కూడా ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం. దీంతో మధ్యప్రదేశ్‌లో అధికంగా ఉల్లి పంట పండించే మాల్వా ప్రాంతంలోని రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. రైతులు కిలో ఉల్లిని ఇంత తక్కువకు హోల్‌సేల్‌గా అమ్ముతున్నా.. రిటైల్ మార్కెట్‌లో మాత్రం వినియోగదారులకు ఆ ధరకు లభించడం లేదు. రిటైల్ లో కిలో ఉల్లి రూ.15 పలుకుతోంది. దీంతో అటు రైతుకు నష్టం రావడమే కాకుండా.. వినియోగదారులకి కూడా భారీ ధర చెల్లించాల్సి వస్తోంది. ఇందులో మధ్యలో ఉన్న దళారులే లాభపడుతున్నారన్నది వాస్తవం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ శబ్ధంతో కూలిన బ్రిడ్జి.. ఎక్కడంటే..
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
టీమిండియా అండర్-19 జట్టులో హైదరాబాదీకి ఛాన్స్
రూటు మార్చిన చైన్ స్నాచర్లు.. డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

