AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్మికకు పబ్లిక్‌లోనే ముద్దుపెట్టేసిన రౌడీ హీరో

రష్మికకు పబ్లిక్‌లోనే ముద్దుపెట్టేసిన రౌడీ హీరో

Phani CH
|

Updated on: Nov 15, 2025 | 12:18 PM

Share

"ది గర్ల్ ఫ్రెండ్" సక్సెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ రష్మిక చేతిపై ముద్దు పెట్టడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో వారి ప్రేమ వ్యవహారం, నిశ్చితార్థం పుకార్లకు మళ్లీ తెరలేచింది. రష్మిక సైతం విజయ్ దేవరకొండ లాంటి వారు జీవితంలో ఉండటం వరం అనడం, ఆయన ప్రశంసించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అభిమానులలో వారి రిలేషన్‌పై కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక, దీక్షిత్‌ శెట్టి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలె విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. విభిన్న కోణాలను ఆవిష్కరించింది. రష్మిక భిన్న భావోద్వేగాలతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ క్ర‌మంలో హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్ వేడుక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ ఈవెంట్‌కి రష్మిక మందన్న స్నేహితుడు, స్టార్ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఈ సక్సెస్ మీట్‌లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ రష్మిక చేతిపై పబ్లిక్‌లోనే ముద్దు పెట్టాడు. దీంతో ప్రేక్షకుల చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ఆ స‌మ‌యంలో రష్మిక కూడా సిగ్గుపడుతూ బ్లష్ అవ్వడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు, ఇటీవలే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీనిపై ఇప్పటివరకు రష్మిక గానీ, విజయ్ దేవరకొండ గానీ అధికారికంగా స్పందించలేదు. కానీ ఈ సక్సెస్ మీట్‌లో చోటు చేసుకున్న ఈ రొమాంటిక్ మూమెంట్ ఫ్యాన్స్‌లో కొత్త ఊహాగానాలకు తావిచ్చింది. ‘ది గర్ల్ ఫ్రెండ్’లో రష్మిక మందన్న నటనపై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఎమోషనల్ సీన్స్‌, న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకు బలమని అభిమానులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. రష్మికకు ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్‌గా మారింది. దీనిపై ఫ్యాన్స్ ఇది రీల్ కాదు, రియల్ లవ్ స్టోరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్ రష్మిక – విజయ్ దేవరకొండ జంట రొమాంటిక్ మూమెంట్‌తో మ‌రింత హైలైట్ అయ్యారు. ఈ సందర్భంగా ర‌ష్మిక .. మనలైఫ్‌లో విజయ్‌ దేవరకొండ లాంటి వారు ఉండటం ఒక వరం అని తెలిపింది. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్‌ లాంటి వారు ఉండాలని ఆమె చెప్పడం అంద‌రిలో కొత్త అనుమానాలు క‌లిగిస్తున్నాయి. విజయ్‌ తనని మొదటి నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నాడని, ఈ సినిమా విజయంలోనూ భాగస్వామి అయ్యాడని, ఈ సినిమా మొత్తం జర్నీలో తను వెంటే ఉన్నాడని, అన్ని రకాలుగా అండగా నిలిచాడంటూ ర‌ష్మిక చెప్పుకొచ్చింది

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిలో ఉల్లి ఒక్క రూపాయి మాత్రమే.. ఎక్కడంటే

భారీ శబ్ధంతో కూలిన బ్రిడ్జి.. ఎక్కడంటే..

అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్‌ కాల్స్‌.. ఆ తర్వాత

టీమిండియా అండర్-19 జట్టులో హైదరాబాదీకి ఛాన్స్‌

రూటు మార్చిన చైన్ స్నాచర్లు.. డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు